Uncategorizedయంగ్ టైగర్ ఓవర్సీస్ సత్తా తెలుసా.. దిమ్మదిరిగే వివరాలు.. చూస్తే షాకే!!

యంగ్ టైగర్ ఓవర్సీస్ సత్తా తెలుసా.. దిమ్మదిరిగే వివరాలు.. చూస్తే షాకే!!

జనతా గ్యారేజ్. అక్కడ అన్ని రిపేర్లు చేస్తారు. రిపేర్ల సంగతేమో కానీ.. జనతా గ్యారేజ్ ఇప్పుడు అన్ని రికార్డులను బీట్ చేస్తోంది. ఒక్క మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనే జనతా గ్యారేజ్ ఫీవరే. ముఖ్యంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే.. ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. రిలీజ్ కు ముందే మూవీ చూడాలన్న వాళ్ల ఉత్సాహం అక్కడి పాత రికార్డులను కూడా తుడిచేస్తోంది.

ఓవర్సీస్ లో తెలుగు మార్కెట్ అంతంతే. అక్కడ బాలీవుడ్ కు ఉన్న మార్కెట్ తో పోల్చుకుంటే మనది తక్కువే. అమీర్ ఖాన్ PK మూవీ రికార్డులు బద్దలు కొట్టింది. దాదాపు 10 ప్రిమీయర్ షోలు పడ్డాయి. అప్పట్లో అదే పెద్ద రికార్డు. కానీ మన బుడ్డోడు ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేస్తున్నాడు. USలో ఇప్పడు జనతా గ్యారేజీ 17చోట్ల ప్రీమియర్ షో లు పడుతున్నాయి. అది కూడా అత్యధిక కలెక్షన్లతో. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లన్ని అమ్ముడయ్యాయి. ప్రిమీయర్ షోల కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు.

ఒక్క US ఏంటీ.. మిగిలిన దేశాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబీ, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, UK, సింగపూర్, మలేషియా, కువైట్, ఫిలిఫ్పైన్స్ లాంటి దేశాల్లోనూ మూవీ అత్యదిక థియేటర్లలో రిలీజ్ అవుతోంది. జూనియర్ గత సినిమాలతో పోల్చుకుంటే జనతా గ్యారేజీ విదేశాల్లోనూ మంచి రికార్డే కొట్టేసాలా ఉంది.

ఇక ఇప్పటివరకు తెలుగు మార్కెట్టే లేని బ్రూనే లో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుండటం విశేషం. ఇక గతంలో జూనియర్ మూవీలు రిలీజ్ కానీ దేశాల్లో కూడా ఈసారి మూవీ విడుదలవుతోంది. నెదర్ లాండ్స్, బెల్జియం, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్ లాండ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోనూ జనతా గ్యారేజీ ఫీవర్ సూపర్ గా కనబడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news