2016లో చిన్న సినిమాలదే హవా.. భారీ వసూళ్లతో దుమ్ము దులిపేశాయి

2016 small movies gets huge collections

In 2016 there are some small budget movies has done very well at the worldwide boxoffice report and become big hits amongst all films. find out the list in below articles.

2016లో ఎన్నో సినిమాలలో వచ్చిన సినిమాలన్నింటిలో చిన్నవే తమ సత్తా చాటాయి. ఆడియెన్స్ మనసుల్ని దోచుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద నుంచి భారీ వసూళ్లు కలెక్ట్ చేశాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల జేబుల్లో కోటానుకోట్లు లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ మూవీలేంటో ఓసారి చూద్దాం..

1. క్షణం : అడవిశేష్, అదాశర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోకెల్లా బెస్ట్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది. కేవలం రూ.1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అక్షరాల రూ.12 కోట్లు షేర్, రూ.20 కోట్లపైన గ్రాస్ రాబట్టింది.

2. ఈడోరకం ఆడోరకం : జీ.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ రూ.8 కోట్లలోపే తెరకెక్కగా.. ఏకంగా రూ.20 కోట్లపైన షేర్ రాబట్టింది. ఆడియెన్స్‌ని ఈ చిత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వించడం వల్లే దీనికి వారు బ్రహ్మరథం పట్టారు.

3. పెళ్ళిచూపులు : ఈ మూవీకి నటీనటుల నుంచి టెక్నీషియన్స్ వరకు పనిచేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అండగా నిలవడంతో.. ఇది బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసింది. ఏకంగా రూ.25 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. అందునా.. యూఎస్‌లో 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేయడం మరో విశేషం. దీంతో.. తెలుగు చిత్రాల చరిత్రలో అమెరికాలో ఇది అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

4. జ్యో అచ్యుతానంద : శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారారోహిత్, నాగశౌర్య బ్రదర్స్‌గా నటించిన ఈ చిత్రం రూ.2 కోట్లలోపు బడ్జెట్‌లో రూపొందగా.. రూ.5 కోట్లపైనే షేర్ రాబట్టింది. ఈ అమౌంట్ పెద్దది కాకపోయినా.. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలను సంతృప్తి పరచడంతో ఇది హిట్ లిస్ట్‌ల జాబితాలోకి చేరింది.

5. ఎక్కడికి పోతావు చిన్నవాడా : ఈ ఏడాది చివర్లో డీమోనిటైజేషన్ సమయంలో వచ్చిన ఈ చిత్రం.. అనూహ్యమైన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్లలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా రూ.40 కోట్లు గ్రాస్, రూ.25 కోట్లపైనే షేర్ రాబట్టింది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ కథానాయికుడిగా వచ్చిన ఈ ఫాంటసీ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడంతో బాక్సాఫీస్‌ని దున్నేసింది.

6. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ : కమెడియన్ సప్తగిరి తొలిసారి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కూడా కమర్షియల్‌గా విజయం సాధించింది. రూ.3 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తీయగా.. రూ.5 కోట్లపైనే షేర్ రాబట్టింది. ఇంకా ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళుతోంది.

Leave a comment