Gossipsమిస్టర్ మజ్ను పాప తక్కువదేం కాదండోయ్.. బికిని రచ్చ చూస్తే నోరెళ్లబెడతారు..!

మిస్టర్ మజ్ను పాప తక్కువదేం కాదండోయ్.. బికిని రచ్చ చూస్తే నోరెళ్లబెడతారు..!

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో హీరోకి మూడవ సినిమా.. డైరక్టర్ కు రెండో సినిమాగా వచ్చింది మిస్టర్ మజ్ను. ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ను మెప్పించినా ఫైనల్ గా మళ్లీ ఆడియెన్స్ ను నిరాశపరచిందని తెలుస్తుంది. అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటుగా ఓ అమ్మడు స్క్రీన్ స్పేస్ తక్కువైనా సరే కనిపించిన కొద్దిసేపైనా ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ ఫ్లైట్ లో వచ్చేప్పుడు కనిపిస్తుంది నిజియా డేవిసన్.

హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న ఆమె సినిమాలో చిన్న పాత్రతో సరిపెట్టుకుంది. అంతేకాదు మిస్టర్ మజ్నులో రెండు మూడు సీన్స్ లో కనిపిస్తుంది నజియా డెవిసన్. క్లైమాక్స్ ఎయిర్ పోర్ట్ సీన్ లో కూడా ఆమె ఉంటుంది. నజియా కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించింది. అయితే అలాంటి చిన్న రోల్ చేసిన ఆమె గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది అమ్మడి విశ్వరూపం. నజియా డెవిసన్ మోడల్ కమ్ యాక్ట్రెస్. అమ్మడు ఇన్ స్టాగ్రాంలో బికిని రచ్చ మాములుగా లేదు.

బాలీవుడ్ లో గర్ల్ ఇన్ రెడ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించిన నజియా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మిస్టర్ మజ్నులో సరైన పాత్ర పడలేదని చెప్పాలి. అయితే తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో ఆమె పడినట్టే అనిపిస్తుంది. ఈమధ్య ఇంటర్వ్యూస్ లో నజియా కూడా తెలుగు అవకాశాలు వస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరి హీరోయిన్ మెటీరియల్ అయిన నజియా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news