Gossipsబెల్లంకొండ బాబు కన్నుల్లో పడ్డ ఆరెక్స్ పాప..!

బెల్లంకొండ బాబు కన్నుల్లో పడ్డ ఆరెక్స్ పాప..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కాని సినిమా బడ్జెట్, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. మొదటి సినిమా అల్లుడు శీను నుండి రీసెంట్ గా వచ్చిన కవచం వరకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా బడ్జెట్ రేంజ్ అందరికి తెలిసిందే. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీత సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ కవచం సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఇక కాజల్ తో జోడీ కడుతూనే మనోడు చూపు ఆరెక్స్ పాప మీద పడ్డది.

అందుకే సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో ఓ క్రేజీ ఐటం సాంగ్ ఒకటి ప్లాన్ చేయించాడు. ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఎక్కించేలా చేసిన పాయల్ రాజ్ పుత్ ఈసారి ఐటం సాంగ్ తో అదరగొట్టేందుకు రెడీ అయ్యింది. ఈ సాంగ్ లో కూడా పాయల్ రెచ్చిపోవడం ఖాయమని తెలుస్తుంది. తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి. సీత ఇదేదో లేడీ ఓరియెంటెడ్ సినిమా టైటిల్ గా ఉన్నా ఈ సినిమాతో అయినా బెల్లంకొండ బాబు హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మొత్తానికి పాయల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ పాటతో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా లో కాజల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న తేజ ఈ సినిమాతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news