Gossipsఎన్టీఆర్- చెర్రీల పాత్రల పై షాకింగ్ నిర్ణయం..?

ఎన్టీఆర్- చెర్రీల పాత్రల పై షాకింగ్ నిర్ణయం..?

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో ఎన్టీఆర్ … చెర్రీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ యంగ్ హీరోలు ఇద్దరూ దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో …. ‘RRR ‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్ డేట్ ఎంతో ఇంట్రెస్టింగ్ రేపుతూనే ఉంది. అంతే కాదు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా… భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతూ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

ఈ చిత్రం స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బందిపోటుగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి … మరో వార్త ఇప్పడు వైరల్ గా మారింది. ‘RRR’లో ఎన్టీఆర్, చెర్రీ చనిపోతారని… తారక్, చెర్రీ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉంటారని… స్వాతంత్ర పోరాట సమయంలో జరిగే పోరులో వీరిద్దరూ చనిపోతారని… ఆ తరువాత మళ్ళీ … వీరిద్దరూ జన్మిస్తారని.. 2000 సంవత్సరంలో తిరిగి ప్రాణ స్నేహితులుగా మారతారంటూ ఈ సినిమా కథ గురించి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గాసిప్స్ పై చిత్ర యూనిట్ మాత్రం నోరు మెదపడంలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news