ఎన్టీఆర్…ది బెస్ట్ హ్యూమన్….ఈ సారి ఆ స్టార్ సినిమాకు స్వరసాయం!!

young-tiger-ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. స్నేహం కోసం దేనికైనా రెడీ అనే ఎన్టీఆర్ ఈ సారి రానా కోసం ముందుకొచ్చాడు. రానా, తాప్సీలు హీరో, హీరోయిన్లుగా 1971 యుద్ధ నేపథ్యంలో ‘ఘాజీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. పివిపి ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఆ సినిమాకు కాస్త ఎక్కువ బడ్జెట్టే అయింది. అందుకే సినిమాకు మైలేజ్ తీసుకురావడం కోసం ఎవరైనా ఓ స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నారు.

వెంకటేష్‌తో సహా కొంతమంది స్టార్స్‌ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే చివరికి ఎన్టీఆర్ ఒకె చెప్పడంతో ‘ఘాజీ’ టీం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. రీసెంట్‌గా రామానాయుడు డబ్బింగ్ స్టూడియోలోనే వాయిస్ ఓవర్ చెప్పేశాడు ఎన్టీఆర్. సినిమా ప్రారంభంలోనే ఇండియ పాకిస్తాన్ మధ్య వచ్చిన యుద్ధాల గురించి చెప్తూ ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ పివిపితో సహా రానా, తాప్సీలు కూడా ఎన్టీఆర్ మంచితనాన్ని మనఃస్ఫూర్తిగా అభినందించారు. ఘాజీలాంటి ఓ వాస్తవ కథకు ఎన్టీఆర్ వాయిస్ హెల్ప్ అవుతుంనడంలో సందేహం లేదు. 1971లో విశాఖ తీరాన పాకిస్తాన్ సబ్‌మెరైన్‌కి, ఇండియా సబ్‌మెరైన్‌కి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

More from my site