Newsనాన్సెన్స్.. ఈ కంపారిజన్ ఏంటండి..!

నాన్సెన్స్.. ఈ కంపారిజన్ ఏంటండి..!

రాం చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను రెండు సూపర్ హిట్లు కొట్టాయి. ఈ సినిమాల హిట్లు బాక్సాఫీస్ కలక్షన్స్ కొంత ఆడియెన్స్ ను కన్ఫ్యూజ్ చేశాయి. రంగస్థలం ముందు రిలీజ్ అయ్యి హిట్ కొట్టగా ఆ తర్వాత 21 రోజులకు వచ్చిన భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేసింది.

ధ్రువ తర్వాత రాం చరణ్ రంగస్థలం తో కెరియర్ లో బెస్ట్ హిట్ కొట్టాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సైతం క్రాస్ చేసింది. అఫిషియల్ గా నాన్ బాహుబలి రికార్డులన్ని ఇప్పుడు రంగస్థలం పేరు మీద ఉన్నాయి. అయితే భరత్ అనే నేను కూడా కలక్షన్స్ బీభత్సం సృష్టించింది.

రీసెంట్ గా భరత్ 190 కోట్ల గ్రాస్ కలక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మీడియా మాత్రం రంగస్థలం, భరత్ అనే నేను రెండు సినిమాలను కంపేర్ చేస్తూ వార్తలు ప్రసారం చేసింది. ఈ విషయంపై రాం చరణ్ సీరియస్ అయ్యాడు. ఇద్దరు హీరోలకు రెండు సూపర్ హిట్లు వచ్చాయని కాకుండా ఆ హీరో కంటే ఈ హీరో సినిమా ఎక్కువ వసూళ్లను రాబట్టిందని వార్తలు రాయడం కరెక్ట్ కాదని అన్నాడు. పర్సనల్ గా మహేష్ తనకు మంచి స్నేహితుడని భరత్ అనే నేను సక్సెస్ కు తాను ఆనందించానని అన్నాడు చరణ్. చూస్తుంటే చరణ్ హీరోల మధ్య మీడియా కూడా పుల్లేస్తుంది అన్న వాదనని బయటపెట్టాడని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news