Gossipsమహానటి ఎఫెక్ట్.. తెర మీదకు ఆమె బయోపిక్..!

మహానటి ఎఫెక్ట్.. తెర మీదకు ఆమె బయోపిక్..!

సావిత్రి మహానటి సినిమా ఎన్నో సంచలనాలకు నాంధి పలుకుతుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా ప్రేక్షకుల హృదయాలనే కాదు సిని ప్రియుల మనసులను గెలుచుకుంటుంది. సినిమా గురించి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ తమ స్పందన తెలియచేశారు. ఇదంతా ఒక ఎత్తైతే మహానటి చూసి సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్ బయోపిక్, వై.ఎస్.ఆర్ బయోపిక్ యాత్ర మీద మరింత కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు.

అంతేకాదు కొన్నాళ్లుగా అనుకుని ఆగిపోయిన జీవిత చరిత్రలను కూడా తెరకెక్కించాలన్న ఊపు తెచ్చింది మహానటి సినిమా. ఈ క్రమంలోనే శ్రీదేవి బయోపిక్ పై చర్చలు మొదలు పెట్టారు. సౌత్ లో స్టార్ కిరీటం అందుకుని నార్త్ లో సెటిల్ అయిన శ్రీదేవి అంటే ఇష్టపడని వారుండరు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనంతలోకాలకు వెళ్లిన ఆమె బయోపిక్ పై అందరు మాట్లాడుతున్నారు.

మహానటి దర్శకుడే శ్రీదేవి బయోపిక్ పై స్పందించడం జరిగింది. అయితే తాను మాత్రం ఆ బయోపిక్ డైరెక్ట్ చేయలేనని చెప్పేశాడు నాగ్ అశ్విన్. మరి శ్రీదేవి బయోపిక్ ఉంటుందా.. ఒకవేల చేస్తే ఎవరి డైరెక్ట్ చేస్తారు.. అన్న వాటి మీద సోషల్ మీడియాలో భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news