Gossipsపూరి తో సాహసం చేయబోతున్న చరణ్ ..

పూరి తో సాహసం చేయబోతున్న చరణ్ ..

ధ్రువ తర్వాత రాం చరణ్ కెరియర్ లో బెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన సినిమా రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా చెర్రి ఇదవరకు సినిమాల రికార్డులన్ని కొల్లగొట్టింది. అంతేకాదు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది. మంచి కథ దొరికితే చరణ్ ఎంతగా నటించగలడు అన్నది రంగస్థల సినిమాతో ప్రూవ్ అయ్యింది.
ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేశాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చెర్రి తన మొదటి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తో జత కడుతున్నాడని అంటున్నారు. ఈమధ్య అన్ని ఫ్లాపులను ఫేజ్ చేస్తున్న పూరి తనయుడు ఆకాష్ తో మెహబూబా సినిమా చేస్తున్నాడు.
ఆల్రెడీ రిలీజ్ కు రెడీ గా ఉన్న ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు పూరి జగాన్నాథ్. ఇప్పటికే చెర్రికి చూచాయగా ఓ లైన్ చెప్పాడట. చెర్రి ఓకే అనడమే ఆలస్యం సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే అంటున్నారు. స్టార్ హీరో అయినా సరే అతి తక్కువ టైం లో సినిమా పూర్తి చేసే పూరి చెర్రితో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. చిరుత తర్వాత చరణ్ పూరితో చేస్తున్న సినిమా స్ట్రాంగ్ కంటెంట్ తో రాబోతుందని అంటున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news