Gossipsఅన్న కన్నా మహేష్ ఎక్కువా?

అన్న కన్నా మహేష్ ఎక్కువా?

నందమూరి బ్రదర్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ రాం ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ ను దూరంగా పెట్టినా కళ్యాణ్ రాం మాత్రం దగ్గరయ్యాడు. ఎన్.టి.ఆర్ బాలయ్యల మధ్య గొడవల సంగతేటంటో తెలియదు కాని కళ్యాణ్ రాం మాత్రం ఎన్.టి.ఆర్ ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారి మధ్య బాండింగ్ అందరికి తెలిసిందే.

ఈమధ్య కళ్యాణ్ రాం ప్రతి సినిమా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఎం.ఎల్.ఏ సినిమాకు మాత్రం రాలేదు. ఎందుకు ఏంటి కారణాలు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్పుకొచ్చారు. ఎన్.టి.ఆర్ లుక్ రివీల్ కాకూడదు అన్న టాకే ఎక్కువ వినపడింది. అయితే ఆ వెంటనే ఐపిఎల్ యాడ్ లో కనిపించాడు. అప్పుడే వార్తలు గుప్పుమన్నాయి.

ఇక ఇప్పుడు మహేష్ ఆడియోకి ఎన్.టి.ఆర్ వస్తున్నాడని వార్తలు నందమూరి ఫ్యాన్స్ కు మరింత షాకింగ్ గా మారాయి. అన్న సినిమా ఈవెంట్ కు వెళ్లకుండా మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లడమేంటని కారాలు నూరుతున్నారు. అయితే తమ హీరో ఏం చేసినా ఓ అర్ధం ఉంటుందని సరిచెప్పుకునే ఫ్యాన్స్ ఉన్నా కొంతమంది మాత్రం కళ్యాణ్ రాం కన్నా మహేష్ ఎక్కువా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ వార్తలు ఎన్.టి.ఆర్ దాకా వెళ్తే ఎలా స్పందిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news