Moviesకళ్యాణ్ రామ్ MLA ప్రీ-రివ్యూ

కళ్యాణ్ రామ్ MLA ప్రీ-రివ్యూ

కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మంచి లక్షణాలున్న అబ్బాయి ముందు సరదాగా కనిపించి ఆ తర్వాత ఎం.ఎల్.ఏ గా రంగంలో దిగుతాడు. విలన్ మీద పగ సాధించేందుకు ఎం.ఎల్.ఏ గా మారాలనుకున్న హీరో ఎలా గెలిచాడు అన్నదే సినిమా అని తెలుస్తుంది.

ఈ సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. సినిమాలో కాజల్ ప్రత్యేకంగా గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. కళ్యాణ్ రాం లుక్ కూడా బాగుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రాం ఎనర్జిటిక్ గా కనిపించిన ఈ సినిమా కచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని అంటున్నారు. సినిమా ఆడియెన్స్ ను అలరించేలా ఎంటర్టైన్ మోడ్ లో నడుస్తుంది.

బ్రహ్మానందం కామెడీ కూడా అలరిస్తుందని చెప్పొచ్చు. మణిశర్మ మ్యూజిక్ సాంగ్స్ క్యాచీగానే ఉన్నాయి. లక్ష్మి కళ్యాణం తర్వాత కళ్యాణ్ రాం, కాజల్ నటించిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. థర్టీ ఇయర్ పృధ్వి కామెడీ కూడా సినిమాలో బాగుంటుందని తెలుస్తుంది. రవికిషన్ విలనిజం కూడా సినిమాపు ప్లస్ అవనుంది.

సినిమాలో కళ్యాన్ రాం డైలాగ్స్ కూడా బాగున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటే కళ్యాణ్ రాం ఎకౌంట్ లో సూపర్ హిట్ పడినట్టే. సినిమా రిజల్ట్ ఏంటన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news