Moviesమెగాస్టార్ మనసు గెలిచిన బోయపాటి..!

మెగాస్టార్ మనసు గెలిచిన బోయపాటి..!

బోయపాటి సినిమా అంటే క్లాస్ ఆడియెన్స్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా మాస్ ఆడియెన్స్ మాత్రం పండుగ చేసుకుంటారు. వారిని రంజింపచేయడంలో బోయపాటి తర్వాతే ఎవరైనా అన్నట్టు లెక్క ఉంటుంది. ఊర మాస్ సినిమాలు ఎన్నొచ్చినా బోయపాటి సినిమాకు సరితూగదు అన్నట్టు తన దర్శకత్వ ప్రతిభ చాటుతున్నాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం తన డైరక్షన్ లో థియేటర్లలో సందడి చేస్తున్న సినిమా జయ జానకి నాయకా.

బెల్లంకొండ శ్రీనివాస్ రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమా మొదటి రోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా బి, సి సెంటర్స్ లో సినిమాకు ఫైనల్ గా మంచి టాక్ వచ్చింది. కలక్షన్స్ కూడా పర్వాలేదు అన్నట్టు ఉన్నాయి. బోయపాటి సినిమా టాక్ విన్న మెగాస్టార్ వెంటనే దర్శకుడికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట.

చిరు 151వ సినిమా అసలైతే బోయపాటి డైరక్షన్ లో ఉండాలి. కాని సురేందర్ రెడ్డితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసేందుకు కచ్చితంగా సంవత్సరం టైం పడుతుంది అందుకే ఈలోగా మరో సినిమా చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు బోయపాటి. జానకి సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంలో ఉన్న బోయపాటి చిరంజీవి నుండి కాల్ రావడంతో మరింత ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news