Gossipsవయసు పెరిగిన వన్నె తగ్గదు... ఎవరు ఆ భామ ?

వయసు పెరిగిన వన్నె తగ్గదు… ఎవరు ఆ భామ ?

రేపు కార్తీక పున్న‌మి
అంత‌కుమునుపే చంద‌మామ నెట్లో సంద‌డి చేస్తోంది
ఈమె టాలీవుడ్ చంద‌మామ‌.. ప్యారిస్ వెళ్లిన ఈ సోయ‌గం
అక్క‌డి నుంచి ఓ ఫొటోని పంపింది.. మేఘాల దారుల్లో వ‌చ్చిన‌
ఆ చిత్రంలో ఆ అంద‌గ‌త్తె మేని ఛాయ త‌ళుకులీనుతోంది
పున్న‌మి చంద‌మామంత గొప్ప‌గా ఆ క‌ళ్లు కాంతులు వెద‌జ‌ల్లుతున్నాయి
ఆ వివ‌రాలివిగో..
వయసు పెరిగిన వన్నె తగ్గకపోవడం అనే మాట కాజల్ అగర్వాల్ ని చూసే కితాబివ్వాలి. తనతో పాటుగా హీరోయిన్లయిన వాళ్లందరూ గ్లో కోల్పోయి ఎబ్బెట్టుగా తయారైనా ఆమె మాత్రం త‌న అందానికి ఏ లోటూ రానివ్వ‌డం లేదు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దేళ్లు కావ‌స్తున్నా ఇప్పటికీ అగ్ర కథానాయికగా కొనసాగుతూ.. గ్లామర్ కాపాడుకుంటూ అభిమానుల్ని అలరిస్తోంది. ఈ మధ్యే వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాతో రోమాన్స్ పండించిన ఈమె ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ సినిమాతో బిజీ అయిపోయింది. కాగా ఇప్పుడీ బ్యూలటీ తన కెరీర్లోనే ఉత్త‌మంగా నిలిచిపోయే చిత్రంలో న‌టించ‌నుంది.తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అదే.. ‘క్వీన్’ సినిమా తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా ప్యారిస్ వెళ్లిన కాజల్.. అక్కడి నుంచి ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో వెరీ గ్లామ‌ర‌స్‌గా ఆమె క‌నిపిస్తోంది.5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news