ఎన్టీఆర్ స్టెప్పులతో దద్దరిల్లిన ఢీ-10

6

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు బుల్లితెర మీద కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది. బిగ్ బాస్ తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా మరోసారి బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించేందుకు వచ్చాడు తారక్. ఈటివి పాపులర్ డ్యాన్స్ షో ఢీ-10 గ్రాండ్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు ఎన్.టి.ఆర్.

ఎన్.టి.ఆర్ వచ్చిన నాటి నుండి ఢీ 10 టైటిల్ విన్నర్ ప్రకటించే దాకా షో అంతా సందడి సందడి అని తెలుస్తుంది. ఇక అక్సా ఖాన్ తో స్వింగ్ జరా సాంగ్ స్పెషల్ గా వేయించగా ఆమెతో కలిసి శేఖర్ మాస్టర్, ఎన్.టి.ఆర్ ఇద్దరు స్టెప్పులేయడం జరిగింది. దానికి సంబందించిన ప్రోమో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

మొత్తానికి ఢీ-10 స్టేజ్ దద్దరిల్లిపోయేలా ఎన్.టి.ఆర్ చేసిన డ్యాన్స్, కామెంట్స్ అన్ని ఈసారి షోకి మంచి టి.ఆర్.పి వచ్చేలా చేస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. దసరా బరిలో ఉండాలని చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది.

Leave a comment