బాలయ్య మోండి..ఇక మారడు..!

9

ఆ మద్య నందమూరి హరికృష్ణ నటించిన సీతయ్య సినిమా చూసిన వారికి ఓ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. సీతయ్య ఎవ్వరి మాట వినడు..ఈ డైలాగ్ ఇప్పుడు బాలయ్య సూట్ అవుతుందని అంటున్నారు. గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పుడు అన్ని రకాల కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దారుణమైన ఫలితాలను ఇచ్చాయి. దాంతో నిర్మాతగా కొత్త ప్రయోగానికి మొదట్లోనే దెబ్బ పడింది. ఇక బాలయ్య తన అభిమానుల పట్ల చూపించే దురుసు తనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఎదురు గా వస్తే పక్కకు వెళ్లమనడం కాదు..పళ్లు రాలేలా కొట్టి మరీ చెబుతారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూసినా ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురావడం లేదు. ఇక ఆయన ఇచ్చే స్పీచులు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇటీవల తెలంగాణలో ఇచ్చిన స్పీచులు చాలా ఫన్నీగా ఉన్నాయి. తాజాగా 118 ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడుతూ..పదే పదే మూవీ టైటిల్ నే తప్పు పలికాడు.

బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా టైటిల్ 118 అని చాలా పెద్ద‌గా రాసి ఉన్న‌ప్ప‌టికి అది గ‌మనించని బాల‌య్య 189 సినిమా అంటూ త‌న స్పీచ్ కొన‌సాగించాడు. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ ,ఎన్టీఆర్‌లు కూడా వెనుక‌నుండి బాల‌కృష్ణ‌కి సినిమా పేరు 118 అని చెబుతున్న‌ప్ప‌టికి ఆయ‌న అలానే 189 సినిమా అంటూ ప‌లుమార్లు అన్నాడు. దాంతో ఆడియన్స్ బాలకృష్ణ నిజంగా సీతయ్య అంటూ ఎవరు చెప్పినా వినరంటూ ఎద్దేవే చేశారు.

Leave a comment