Moviesఫ్యామిలీ స్టార్ సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు ఇతడే.. రీజన్ వింటే...

ఫ్యామిలీ స్టార్ సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు ఇతడే.. రీజన్ వింటే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

సినిమాల్లో ఒక హీరో కోసం అనుకున్న పాత్రలో మరొక హీరో నటిస్తూ ఉండడం సర్వసాధారణమైన విషయమే . ఇది మన అందరికీ తెలుసు . అయితే కొన్ని కొన్ని పిక్చర్స్లో కొన్ని కొన్ని పాత్రల్లో ఈ హీరోనే బాగుంటారు అంటూ గట్టిగా నొక్కిపెట్టి రాసుకుంటారు డైరెక్టర్లు.. కొన్నిసార్లు ఆ హీరోలు కూడా ఆ పాత్రలను రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ దానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాంపేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమా కోసం మూవీ టీం ఎలా ప్రమోషన్స్ చేసిందో చూసాం . కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న ధీమా కూడా వ్యక్తం చేశారు .

కొద్ది సేపటి క్రితమే థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . గతంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో తెరకెక్కిన సినిమాలకు ఈ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి పరశురాంపేట్ల ఈ కథను టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని కోసం రాసుకున్నారట . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ ఇప్పుడు గుర్తొచ్చే పేరు నాని .

అయితే నానినే ఈ కథను రిజెక్ట్ చేశాడట . బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలలో నటిస్తే జనాలకి బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ తోనే ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట . ఈ రీజన్ విన్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇంత మంచి సినిమాను సింపుల్ రీజన్ తో రిజెక్ట్ చేసావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ సినిమాను మిస్ చేసుకుని నాని పెద్ద తప్పు చేశాడు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news