Movies"ఫ్యామిలీ స్టార్" మూవీ రివ్యూ: సీరియల్ కి ఎక్కువ.. సినిమాకి తక్కువ..!

“ఫ్యామిలీ స్టార్” మూవీ రివ్యూ: సీరియల్ కి ఎక్కువ.. సినిమాకి తక్కువ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా సినిమా “ఫ్యామిలీ స్టార్”. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . పరశురాంపేటలో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా ఇష్టంగా నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది .

మొదటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకోవడంలో విజయ్ దేవరకొండ నెంబర్ వన్ అని చెప్పాలి . ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టోరీని అటెంప్ట్ చేశాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . విజయ్ దేవరకొండ అంటే ఘాటు రొమాన్స్ లు బోల్డ్ డైలాగ్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే చాలా పద్ధతిగా ఫ్యామిలీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీలో కూడా నటిస్తాడు విజయ్ దేవరకొండ అంటూ ప్రూవ్ చేసిన సినిమా ఇదే.

సినిమాని నీట్ గా తెరకెక్కించాడు పరశురాంపేట్ల. గతంలో ఆయన తెరకెక్కించిన సర్కారు వారి పాట అదేవిధంగా గీతగోవిందం లాంటి కాన్సెప్ట్ లోనే ఈ మూవీ కూడా ఉంటుంది. పరశురాంపేట్ల అంటే ఓ పద్ధతిగల డైరెక్టర్ అంటూ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

సీతారామం – హాయ్ నాన్న సినిమాల్లో మించిపోయిన రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది . ఇతర నటీనటులకు కూడా సినిమాకి తగిన న్యాయం చేశారు. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేము కానీ ఖచ్చితంగా ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా అని మాత్రం చెప్పొచ్చు . విజయ్ దేవరకొండ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది అని కూడా హామీ ఇవ్వలేము. ఈ సినిమా ఫ్యామిలీస్ కి మరింత బాగా నచ్చుతుంది . అయితే గతంలో అర్జున్ రెడ్డి లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకి వెళ్తే మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ నిరాశ పడక తప్పదు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news