Moviesకేవలం ఆ ఒక్క పని చేయడం వల్లే హిట్ అయిన సినిమాలు...

కేవలం ఆ ఒక్క పని చేయడం వల్లే హిట్ అయిన సినిమాలు ఇవే.. ఎంత స్పెషల్ అంటే..!

జనరల్ గా చాలామంది అనుకుంటూ ఉంటారు . ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే హీరో ప్రధాన కారణం అని.. హీరో బాడీ మాడ్యూలేషన్ హీరో స్టైల్.. హీరో కష్టం హీరో పండించే రొమాన్స్ ..హీరోయిన్ అన్ని ఇంపార్టెంట్ అని అంతా అనుకుంటారు . కానీ అన్నిటికంటే ముఖ్యం స్టోరీ . హీరో ఎంత బాగా నటించినా.. డైరెక్టర్ తాను రాసుకున్న స్టోరీను జనాలకు తెలియజేసే విషయంలో ప్లాప్ అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది . అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. అయితే ఇండస్ట్రీలో కేవలం స్టోరీ వల్లే హిట్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

స్టూడెంట్ నెంబర్ వన్ : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా మనం చూడలేదు. అంతేకాదు రాజమౌళి ప్రతి సీన్ ను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు . ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ ఎంత కారణమో..? అంతకు డబల్ రేంజ్ లో కారణమయ్యాడు రాజమౌళి..

ఛత్రపతి: టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ . ఈ సినిమా మొత్తం కధ కారణంగానే హిట్ అయింది . కేవలం స్టోరీ వల్లే .. చాలా సింపుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ రాజమౌళి డైరెక్షన్ ఈ సినిమాకి హైలెట్ గా మారింది . ప్రభాస్ ఈ సినిమా ద్వారా ఎంత పెద్ద స్టార్ హీరోగా మారడో అందరికీ తెలిసిందే..

ఆర్య: టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు . ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ రేంజ్ రెండు మారిపోయాయి . కాగా ఈ సినిమా స్టోరీ కారణంగానే ఈ సినిమా హిట్ అయింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . లవ్ ఎట్ ఫస్ట్ సైట్ .. వన్ సైడ్ లవ్ ఈ సినిమాకి హైలైట్ గా మారాయి . అంతేకాదు ఈ సినిమా లాంటి సినిమా ఆ తర్వాత మరి ఏదీ కూడా రాకపోవడం గమనార్హం.

మన్మధుడు: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున ఎంత పెద్ద స్టార్ హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన చేత ఇలాంటి రోల్ చేయించడం నిజంగా పెద్ద సాహసమనే చెప్పాలి . ఈ సినిమాకి కథ హైలెట్ .. సింపుల్ లవ్ స్టోరీ అయినప్పటికీ చాలా నీట్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ . ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో మనకు తెలిసిందే.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

బాహుబలి : టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేల చేసిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది. ఈ సినిమాకి హీరో – హీరోయిన్ – విలన్ కన్నా కూడా డైరెక్టర్ ఇంపార్టెంట్. డైరెక్టర్ డైరెక్షన్ ఈ సినిమాని వేరే లెవెల్ లో నిలబెట్టింది . ఈ సినిమాకి మొత్తం ఇంపార్టెంట్ కథ .. ఆ కథ వల్లే ఈ సినిమాకి ప్రాణం పోసినట్లయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news