Moviesబిడ్డని కాపాడుకోవడం కోసం అర్ధరాత్రి ఆ స్టార్ హీరో కి ఫోన్...

బిడ్డని కాపాడుకోవడం కోసం అర్ధరాత్రి ఆ స్టార్ హీరో కి ఫోన్ చేసి డబ్బు అడిగిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి మరియు బాబాయి లాగానే సామాజిక సేవలు చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకుంటూ ఉంటాడు. కానీ వాటిని పెద్దగా బయటపెట్టేందుకు ఇష్టపడడు. కోట్లకి కోట్లు ఖర్చు చేసి పేద ప్రజలకి అన్నం పెట్టినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటికి రానివ్వడు. మనం చేసే మంచి మనకి తెలిస్తే చాలు ప్రతి ఒక్కరికి తెలియ అవసరం లేదు అనే సిద్ధాంతాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాడు చెర్రీ.

ఇక చెర్రీ గొప్ప మనస్తత్వం గురించి పలుమార్లు పలు హీరోలు సైతం బయట పెడుతూ ఉంటారు. ఇక తాజాగా ఇదే క్రమంలో చెర్రీ బిహేవియర్ని బయటపెట్టాడు మంచు మనోజ్. నిన్న అనగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఫాన్స్ బర్తడే విషెస్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ..” 2018లో నేను అమెరికాలో ఉన్న.

ఆ సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆడబిడ్డ దుబాయిలో ఇమిగ్రేషన్ సమస్య వచ్చి చిక్కుకుపోయిందని. 5 లక్షల సహాయం కోసం నాకు ఫోన్ చేసింది. కానీ ఆ సమయంలో నా దగ్గర మనీ అంత లేవు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక చరణ్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. కేవలం నిమిషంలోనే చరణ్ డబ్బు పంపించాడు ” అంటూ చరణ్ చేసిన సహాయాన్ని బయటపెట్టాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీటిని చూసి చరణ్ ని శభాష్ అంటున్నారు ప్రేక్షకులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news