Moviesబన్నీ సినిమా నుంచి ఆ సీన్ ఎందుకు లేపేసారో తెలుసా..? కొంప...

బన్నీ సినిమా నుంచి ఆ సీన్ ఎందుకు లేపేసారో తెలుసా..? కొంప ముంచేశావ్ కదా అల్లు అరవింద్..!!

అల్లు అర్జున్.. ప్రెసెంట్ ఐకాన్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీలో రాజ్యాన్ని ఏలేస్తున్నాడు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు . అంతేకాదు అల్లు అర్జున్ త్వరలోనే ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకురాబోతున్నాడు అంటూ కూడా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గత సినిమా తాలూకా విషయాలు కొన్ని కొన్ని వైరల్ అవుతున్నాయి . అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “బన్నీ”. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బన్నీ కెరీర్ ని మార్చేసింది . అప్పటినుంచి అల్లు అర్జున్ ముద్దుగా ఫ్యాన్స్ ని.. బన్నీ.. స్టైలిష్ స్టార్ అంటూ పిలవడం మొదలుపెట్టారు .

అయితే ఈ సినిమాలో ఒక సీన్ చాలా బాగా తెరకెక్కించాడట వినాయక్.. కానీ అల్లు అరవింద్ ఈ సీను తీసేయమంటూ ఎడిటింగ్ లోనే లేపేసారట. హీరోయిన్ గౌరీ ముంజల్ – అల్లు అర్జున్ల మధ్య ఒక ఘాటు లిప్ లాక్ సీన్ ఉంటుందట . అయితే ఆ సీన్ బయటికి వస్తే తన కొడుకు కెరియర్ నాశనం అయిపోతుంది అని రెండో సినిమాకే ఇలాంటి హైపర్ఫార్మెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ భావించి ఆ సీన్ లేపేసారట. ఆ సీన్ మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించారు అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news