Moviesఅమ్మ బాబోయ్.. దేవర లో జాన్వీ కట్టుకున్న ఈ చీర ఎవరిదో...

అమ్మ బాబోయ్.. దేవర లో జాన్వీ కట్టుకున్న ఈ చీర ఎవరిదో తెలుసా..? అందుకే అంత అందంగా కనిపించిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం కూడా ఇట్టే వైరల్ గా అయిపోతూ ఉండడం మనం బాగా గమనిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వీ కపూర్ తన బర్త్డ డే ను నిన్న చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . తన పుట్టినరోజు సందర్భంగా నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకునింది . మొదటి నుంచి జాన్వి కపూర్ కి ఇది బాగా అలవాటు .

కాగా జాన్వీ కపూర్ బర్త్డ డే సందర్భంగా నిన్న ఆమె నెక్స్ట్ తెలుగు సినిమా అనౌన్స్మెంట్ అఫీషియల్ గా చెప్పుకొచ్చింది మూవీ టీం . బుచ్చిబాబు సనా రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వి కపూర్ అఫీషియల్ గా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . అంతేకాదు జాన్వి బర్త్డ డే సందర్భంగా దేవర టీం స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది . ఈ పోస్టర్లో ఆమె చాలా చాలా అందంగా ముద్దుగా ఉంది .

చీర కట్టులో అద్దిరిపోయే లుక్స్ లో కనిపించింది జాన్వి. అయితే ఈ చీర ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . చాలా ఓల్డ్ మోడల్ అయినా సరే టృఎండీ గా జాన్వీకు బాగా సూట్ అయింది . అయితే ఈ చీర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ చీర జాన్వి కపూర్ అమ్మ శ్రీదేవిది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . తెలుగు ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ బాగా సక్సెస్ అవ్వాలి అని తన తల్లి ఆశీస్సులు తనకు ఉండాలి అని ఈ సినిమాలో ఈ చీర తో ఒక సాంగ్ లో నటించిందట. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news