Moviesదొంగ చాటుగా అలాంటి పనులు చేసిన చిరంజీవి.. ఓపెన్ గా చెప్పేసిన...

దొంగ చాటుగా అలాంటి పనులు చేసిన చిరంజీవి.. ఓపెన్ గా చెప్పేసిన సురేఖ..!

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. అప్పుడొ ఎప్పుడో ఒకచోట దొంగతనం చేసే ఉంటారు . మనలో చాలామంది కూడా నాన్న జేబులో 10 – 20 కొట్టేసిన క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు . అయితే మెగాస్టార్ చిరంజీవి 10 – 20 కాదు ఏకంగా అంతకంటే కాస్ట్లీ వస్తూవులనే కొట్టేసాడు . అది ఏంటో అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి మీకే అర్థమవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ త్రిష డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ మెగా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూమెంట్లోనే మెగాస్టార్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . గతంలో ఉమెన్స్ డే సందర్భంగా సురేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పింది .

చిరంజీవి ఫుడ్ విషయంలో ఎక్కువగా మొండి చేయడు అని.. ఉన్నది తిని సరిపెట్టుకుంటాడు అని ..పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు చిరంజీవికి స్వీట్ లు అంటే మహా మహా ప్రాణమని.. గులాబ్ జామ్ అంటే మరీ మరీ ఇష్టమని.. ఇంట్లో గులాబ్ జామ్ చేసిన ప్రతిసారి అర్ధరాత్రి దొంగతనంగా వెళ్లి గులాబ్ జామ్ తినేసి వస్తూ ఉంటాడు అని .. మార్నింగ్ చూసేసరికి డబ్బా ఖాళీ అయిపోతుంది అని .. అప్పుడే గులాబ్ జామ్ దొంగ ఎవరో మాకు అర్థమైంది అని.. ఫన్నీగా చెప్పుకొచ్చింది . మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news