Moviesరౌడీ హీరో కోసం బ్యాడ్ గర్ల్ గా మారిన గుడ్ హీరోయిన్.....

రౌడీ హీరో కోసం బ్యాడ్ గర్ల్ గా మారిన గుడ్ హీరోయిన్.. అంతా విజయ్ దేవరకొండ మాయ..ఏం చేద్దాం..!!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ రౌడీ హీరో.. టాలీవుడ్ యాటిట్యూడ్ హీరో ..పాన్ ఇండియా హీరో .. హెడ్ వెయిట్ హీరో .. ఒకటి కాదు రెండు కాదు ఇలా నానా రకాలుగా విజయ్ దేవరకొండ పేరుకు ముందు యాడ్ చేస్తూ ఉంటారు జనాలు . అయితే వాటిని పెద్దగా పట్టించుకోడు మన తెలుగు హీరో విజయ్ దేవరకొండ . కష్టాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చి కష్టం ద్వారా తన సొంత నిర్ణయాలతో మంచి మంచి ఆఫర్స్ పట్టి జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది టైంలోని బడా హీరోగా మారిపోయాడు . ఇప్పుడు రామ్ చరణ్ – ఎన్టీఆర్ – బన్నీ – ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకి కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ అంటే దానికి ఏకైక కారణం ఆయనకు ఉన్న డేర్ నెస్.

కంటెంట్ నమ్ముకున్నోడికి కటౌట్ అవసరం లేదు అన్న ఫార్ములాను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు . రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే గౌతం తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు . ఈ సినిమాలో మొదటగా శ్రీ లీలను హీరోయిన్గా అనుకున్నారు . ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో రష్మికను అనుకున్నారట . అయితే కొన్ని కారణాల చేత రష్మికను ఈ సినిమా నుంచి తీసేయాల్సి వచ్చింది .

అయితే ఇప్పుడు ఆ స్థానంలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె మరెవరో కాదు సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వసంత్ రుక్మిని. ఇప్పుడు అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది . అయితే తన సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించే ఈ హీరోయిన్ ఈ సినిమాలో మాత్రం నాటిగా రగ్డ్ లుక్ లో బ్యాడ్ గర్ల్ గా కనిఒఇంచబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో హాట్ బ్యూటీ తృప్తి దిమ్రి కూడా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ కోసం అమ్మాయిలు ఎలా అయినా మారిపోతారు ..అంత విజయ్ దేవరకొండ మాయ అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news