Moviesఎన్టీఆర్ దేవరను అక్టోబర్ 10 వ తేదీనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో...

ఎన్టీఆర్ దేవరను అక్టోబర్ 10 వ తేదీనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? పెద్ద స్కెచే వేశాడు కొరటాల..!!

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ ప్రతి ఒక్కటి కూడా ఫాన్స్ ను ఉత్సాహపరిచే రేంజ్ లో ఉంటున్నాయ్. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులకు గూస్ బంప్స్ మోత మోగించేసింది .

కనీ విని ఎరుగని లుక్స్ లో దేవర సినిమాలో ఎన్టీఆర్ ని చూడడం అభిమానులకి ఇంకా ఇంకా నచ్చేసింది. చిన్న గ్లిమ్స్ తోనే చెమటలు పట్టించేస్తే ఇక రెండున్నర గంట సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసేయడం పక్క అంటున్నారు అభిమానులు . ఎన్టీఆర్ దేవరను ఏప్రిల్ 5వ తేదీ 2024 రిలీజ్ చేయాలని ఎప్పుడో మేకర్స్ ప్రకటించారు . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయడం కుదరడం లేదు అని .. కొత్త డేట్ ని ప్రకటించింది చిత్ర బృందం .

అక్టోబర్ 10 2024 దసరా కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు జూనియర్ ఎన్టీఆర్ . అయితే అక్టోబర్ 10 ఈ సినిమాను రిలీజ్ చేయడం వల్ల పెద్ద స్కెచ్ ఏముంది అంటున్నారు జనాలు. గతంలో దసరా కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి . అంతేకాదు దేవర సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి మనకి ఒక వెపన్ ని హైలెట్ చేస్తూ చూపించారు . ఈ సినిమాకు హైలెట్ అదే . అంతేకాదు దసరా పండుగ కొరటాల శివాకి కూడా బాగా కలిసి వస్తుందట . ఆ కారణంగానే లక్ ని బేస్ చేసుకుని ఎన్టీఆర్ కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నారట. పైగా దసరా హాలిడేస్ కచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమానే ఇది .

అంతేకాదు ఎన్టీఆర్ నటించిన సినిమాలు గురువారంనాడు రిలీజ్ అయితే ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో జనతా గ్యారేజ్ – అరవింద సమేత వీర రాఘవ – జై లవకుశ సినిమాలో కూడా ఇదే ఫార్ములాను అప్లికేబుల్ చేశారు. దేవరను అక్టోబర్ 10 న రిలీజ్ చేయడం ఇది కూడా ఒక కారణమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news