Moviesవేణు స్వామీతో ఆషూరెడ్డి స్పెషల్ పూజలు.. ఎందుకో తెలుసా..? మ్యాటర్ టూ...

వేణు స్వామీతో ఆషూరెడ్డి స్పెషల్ పూజలు.. ఎందుకో తెలుసా..? మ్యాటర్ టూ సీరియసే..!!

ఆషూ రెడ్డి .. సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. డన్ స్మాష్ వీడియోస్ ద్వారా బాగా ట్రెండ్ అయింది . ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో గేమ్ ఆడింది . పలు కవర్ సాంగ్స్ కు అద్భుతమైన రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చి పలు వెబ్ సిరీస్ లోను నటించింది. ఆ తర్వాత స్టార్ సెలబ్రిటీస్ తో సందడి చేసింది . ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..

ఆషూ రెడ్డి..ప్రజెంట్ ఎంత టాప్ మోస్ట్ సెలబ్రిటీనో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె ఒక్క పోస్ట్ పెడితే మిలియన్ వ్యూస్ దాటిపోతాయి. స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదనే చెప్పాలి . రీసెంట్ గా ఆమె వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుంది . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రాజశ్యామలాదేవి , భగలాముఖి దేవి లకు పూజలు నిర్వహించారు ఆషూ రెడ్డి – వేణు స్వామి.

అనంతరం ఆషూ రెడ్డి మెడలో వేణు స్వామి దండకూడా వేశాడు . అంతేకాదు ఆషూ రెడ్డి భక్తి పార్వస్యంతో ఆయన కాళ్లకు మొక్కింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సడన్గా ఆషూ రెడ్డి వేణు స్వామితో పూజలు చేయించడం పై రకరకాల డౌట్లు మొదలయ్యాయి . కొందరు కెరియర్ కోసం అంటూ ఉంటే మరికొందరు పెళ్లి కోసం అంటున్నారు . గతంలో ఆషూ రెడ్డి కొత్త కారు కొనుక్కున్న సందర్భంగా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇప్పుడు మరోసారి ఆషూ రెడ్డి.. వేణు స్వామితో పూజలు చేయించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news