Moviesమొత్తం 6 సినిమాలు.. 6 వేల కోట్లు.. ఇండియన్‌ సినిమాని శాసించే...

మొత్తం 6 సినిమాలు.. 6 వేల కోట్లు.. ఇండియన్‌ సినిమాని శాసించే ఏకైక నటుడు ఇతడే..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో రెబల్ అభిమానులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ప్రభాస్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ఈ పేరు చెప్తే గూస్ బంప్స్ పక్క. ఆరు అడుగుల కటౌట్ చూసి ఎలాంటి వాళ్లైనా సరే అరుపులు కేకలతో హోరెత్తించాల్సిందే . ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించి మరొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది . ప్రభాస్ సలార్ సినిమా తర్వాత ఆయన రేంజ్ క్రేజ్ మొత్తం మారిపోయిందని నెక్స్ట్ ఆయన లైన్ అప్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందేనని ,,

మొత్తం ఆరు సినిమాలతో 6000 కోట్ల బడ్జెట్ తో సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సలార్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కల్కి . ఈ సినిమాపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాగ్ అశ్విన్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుంది అనే నమ్మకాలు ఉన్నాయి .

ఆ తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ప్రభాస్ . ఈ సినిమా కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ పైనే పెడుతున్నాడు సందీప్ రెడ్డివంగా. ఈ మూడు సినిమాలు తర్వాత మళ్లీ సలార్ 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు ప్రభాస్ . ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . అంతేకాకుండా ప్రభాస్ మంచు మనోజ్ తెరకెక్కిస్తున్న క్”అన్నప్ప” సినిమాలోను శివుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రభాస్ నెక్స్ట్ ఆరు సినిమాల డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లాకింగ్ అనిపిస్తుంది. అంతేకాదు మొత్తంగా ఈ ఆరు సినిమాలో బడ్జెట్ ఆరువేల కోట్లు దాటిపోతుంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలాంటి ఘనత సాధించలేదు . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news