టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ ఫాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది . కాగా సోషల్ మీడియాలో బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా తరచుగా యాక్టివ్ గా ఉంటుంది . పలు విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది .
రీసెంట్ గా స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది . అందులో అయాన్ , అర్హలకు సంబంధించిన విషయాలను చెప్పింది. ముఖ్యంగా పిల్లలను పెంచడానికి ఆరు పాయింట్లను చెప్పుకొచ్చింది. పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో మోటివేట్ చేస్తూ ఉండాలి అని క్రియేటివ్ గా ఆలోచించేలా చేయాలి అని చెప్పుకొచ్చింది. వారంలో పిల్లలు ఏ ఏ పనులు చేయాలో ముందే లిస్టు ప్రకారం రాసి షెడ్యూల్లో పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చింది.
ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయట కూడా తిరగనివ్వాలి అని.. ప్రకృతిని ఆస్వాదించే ఇలా చేయాలి అంటూ చెప్పుకు వచ్చింది . సన్లైట్ బాగా ఒంటి మీద పడేలా చేయాలి అని ..అప్పుడు శక్తి బాగా పెంపొందుతుంది అని చెప్పుకు వచ్చింది. ఇతర ప్రాణుల పట్ల జాలి దయ ఉండే విధంగా పెంచాలి అని.. అవన్నీ తల్లిదండ్రులే చూసుకోవాలి అని చెప్పుకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇది నిజంగా తల్లిదండ్రులకి మంచి ఉపయోగకరమైన వీడియో అంటూ పొగిడేస్తున్నారు జనాలు..!!