Movies"అర్జున్ రెడ్డి" సినిమాను సందీప్ ఆ హీరో తెరకెక్కించాలి అనుకున్నాడా..? పేరుతో...

“అర్జున్ రెడ్డి” సినిమాను సందీప్ ఆ హీరో తెరకెక్కించాలి అనుకున్నాడా..? పేరుతో సహా బయటపెట్టేశాడుగా..!!

అర్జున్ రెడ్డి .. ఈ సినిమా పేరు వింటేనే చాలు నర నరాల్లోకి ఎక్కేస్తుంది . బ్యాక్ గ్రౌండ్ లో ఒక గంభీరమైన మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది . అలాంటి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్న సినిమా ఇది. అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ దేవరకొండ కెరియర్ మారింది అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఈ అర్జున్ రెడ్డి కథను మొదటగా సందీప్ రెడ్డివంగా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . ఇదే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు . 2011లో అల్లు అర్జున్ కు ఒక కథ చెప్పాడట సందీప్ రెడ్డివంగా. కానీ కొన్ని కారణాలవల్ల అది ఆగిపోయిందట . ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథను ఆయనకు వినిపించాలి అనుకున్నా.. ఆయనను కలవడానికి ఛాన్స్ దొరకలేదట .

ఆ స్క్రిప్ తో చాలా మంది నటులు, నిర్మాతలను కలిశాడట చివరికి ఆయనే నిర్మించుకున్నాడట . విజయ్ దేవరకొండ ఒక స్నేహితుడు ద్వారా పరిచయమై అలా ఈ సినిమాను కమిట్ అయ్యాడట . ఒకవేళ బన్నీ ని కానీ కలిసే ఛాన్స్ వచ్చి ఉంటే కచ్చితంగా ఈ సినిమా బన్నీతోనే తెరకెక్కించేవాడినని ఆయన చెప్పుకు రావడం గమనార్హం. అలా ఈ మూవీ బన్నీ చేతి నుండి విజయ్ దేవరకొండ చేతికి వెళ్లి ఆయన కెరియర్ని మార్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news