Moviesరాజ‌మౌళి - మ‌హేష్ సినిమా బ‌డ్జెట్ తెలిస్తే క‌ళ్లు తిరుగుతాయ్‌... ఇండియ‌న్...

రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా బ‌డ్జెట్ తెలిస్తే క‌ళ్లు తిరుగుతాయ్‌… ఇండియ‌న్ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం…!

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ ఆర్ సినిమా ఎలాంటి సెన్షేష‌న్ క్రియేట్ చేసిందో చూశాం. టాలీవుడ్ యంగ్‌స్ట‌ర్స్ ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రు. 1200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా రెండేళ్లు అవుతోంది. ఇంకా రాజ‌మౌళి కొత్త సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఇక రాజమౌళి తన తర్వాత సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం యావ‌త్ టాలీవుడ్ 20 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా బ‌డ్జెట్ ఏకంగా రు. 1000 కోట్లు అని టాక్ ?

ఇదే నిజం అయితే.. ఇది ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఆల్ టైం రికార్డుగా నిలిచిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఏ సినిమాకి కూడా ఇంత బడ్జెట్ పెట్టలేదు. రాజ‌మౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్ల‌ను కూడా తీసుకోనున్నారు. ఆఫ్రిక‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా షూటింగ్‌ను వ‌ర‌ల్డ్ వైజ్‌గా అనేక లొకేష‌న్ల‌లో షూట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news