Moviesపెద్ద తోపు అనుకునే ప్రశాంత్ వర్మ .. హనుమాన్ విషయంలో చేసిన...

పెద్ద తోపు అనుకునే ప్రశాంత్ వర్మ .. హనుమాన్ విషయంలో చేసిన తప్పు ఏంటో తెలుసా..?

ప్రశాంత్ వర్మ .. ఇప్పుడు వరకు తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ అందుకున్నాయి. సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము కానీ ఖచ్చితంగా జనాలను ఆకట్టుకునే సినిమాలు అని చెప్పక తప్పదు. అలాంటి ప్రశాంత్ వర్మ నుంచి హనుమాన్ సినిమా రాబోతుంది అనగానే జనాలు హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు . ఎప్పుడైతే సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ వస్తుందో అప్పటివరకు కూడా సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది.

కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం తేజ తో పాటు మిగతా అభిమానుల్లోను ఉండింది. అయితే గుంటూరు కారం సినిమాకి కాంపిటీషన్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని తెలియగానే సగం మంది ఫ్యాన్స్ హనుమాన్ కి నెగిటివ్గా వచ్చేసారు . మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబుకి సపోర్ట్ చేసే మిగతా హీరో ఫ్యాన్స్ కూడా హనుమాన్ సినిమాలు పక్కన పెట్టడం మొదలుపెట్టారు . అంతేకాకుండా తాజాగా రిలీజ్ అయిన సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉండడంతో సినిమాకి మరింత స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి .

సినిమా కధ కంటెంట్ విషయానికొస్తే ఏం మాత్రం వేలు పెట్టలేము.. ప్రశాంత్ వర్మ అందులో తోపు అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు మనం తెరపై చూడలేదని చెప్పాలి. అలాంటి జోనర్ ని టచ్ చేసి ప్రశాంత్ వర్మ నిజంగా సాహసమే చేశాడు . అది కూడా ఒక యంగ్ హీరోతో ఇంత పెద్ద సినిమాను తెరకెక్కించడం అంటే నిజంగా గ్రేటే..ఆ గట్స్ కి హాట్సాఫ్ చెప్పాలి. అయితే తాను రాసుకున్న కథను ప్రజలకు చెప్పే విషయంలో మాత్రం ప్రశాంత్ వర్మ ఫ్లాప్ అయ్యాడు .. కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి .. ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ అద్భుతంగా ఉంటుంది.

అది మిగతా సినిమాలు చూస్తే మనకి ఈజీగా అర్థమయిపోతుంది . కానీ హనుమాన్ సినిమాలో మాత్రం క్లారిటీ మిస్ అయింది . ఫస్ట్ ఆఫ్ మొత్తం ఇంట్రడక్షన్లతో కవర్ చేసిన హనుమాన్ ప్రశాంత్ వర్మ సెకండ్ హాఫ్ మాత్రం ఇరగదీసేశాడు . ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఘాటైన సీన్స్ ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ ఇచ్చుంటే మాత్రం హనుమాన్ సినిమా గుంటూరు కారం ని దాటిపోయేది అని చెప్పడంలో సందేహం లేదు . ఆ ఒక్క తప్పు కారణంగా ప్రశాంత్ వర్మ ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news