Movies"హనుమాన్" ట్విట్టర్ రివ్యూ: తేజ సజ్జ హిట్ కొట్టాడా..? "తుస్సు" మనిపించాడా..?

“హనుమాన్” ట్విట్టర్ రివ్యూ: తేజ సజ్జ హిట్ కొట్టాడా..? “తుస్సు” మనిపించాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తేజ సజ్జ.. తాజాగా నటించిన సినిమా హనుమాన్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . గుంటూరు కారం లాంటి బిగ్ సినిమాతో పోటీ పడ్డ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకునింది .. అసలు ఈ సినిమాలో ఏముంది..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

ఈ కథ మొత్తం భగవంతుడు శక్తులతో పవర్స్ వచ్చిన హనుమాన్ కి మిషన్స్ సహాయంతో పవర్స్ తెచ్చుకొని సూపర్ మాన్ గా చలామణి అయ్యే వ్యక్తికి మధ్య జరిగే కథ. చాలా ఇంట్రెస్టింగ్ గానే రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ . కానీ దాన్ని తెరకెక్కించి ప్రజలకు అర్థం చేసే విషయంలో కూసింత ఫ్లాప్ అయ్యాడనే చెప్పాలి . అయితే కథలో పిల్లలకు మెచ్చే ఎలిమెంట్స్ పెట్టుకోవడంతో సినిమా కూసింత సాఫీగా ముందుకెళ్ళిపోతుంది. అంతేకాదు ఆ మధ్య మలయాళం లో వచ్చిన మిన్నళ్ మురళీ.. అనే సినిమా కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది .

దీంతో ఆ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. కాగా స్టార్టింగ్ లోనే అద్దిరిపోయే రేంజ్ లో ఇంట్రక్షన్ చూపించిన ప్రశాంత్ వర్మ పోను పోను బాగా చించేస్తాడు.. అనుకుంటాం కానీ మెల్లిగా కథ డల్ అవుతుంది . హీరో ఇంట్రడక్షన్ ఫ్యామిలీ స్టెప్ తప్పిస్తే మరి ఏదీ ఉండదు. పైగా బ్యాక్ డ్రాప్స్ కూడా అన్ని విలేజ్ కావడంతో పాతకాలం లుక్ కనిపిస్తుంది . ఎప్పుడైతే హీరోలు సూపర్ నాచురల్ శక్తులు వస్తాయో అప్పట్నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది.

సినిమా చూడాలి రా అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది . ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కూడా బాగా రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ . అటు ఇటుగా ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ జనాలకి చూపించేశాడు. ఈ సినిమాలో తేజ పర్ఫామెన్స్ మాత్రం సూపర్ డూపర్ అని చెప్పాలి. వందకు రెండు వందల శాతం న్యాయం చేశాడు. డైరెక్టర్ ఎక్కడ ఎలా ఏం చెప్పాడో అదే చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ టాక్ దక్కించుకుంది . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news