Moviesనాగార్జున "నా సామీ రంగా" ట్విట్టర్ రివ్యూ: ముసలోడే కానీ..ఆ విషయంలో...

నాగార్జున “నా సామీ రంగా” ట్విట్టర్ రివ్యూ: ముసలోడే కానీ..ఆ విషయంలో మహానుభావుడు..!!

అక్కినేని నాగార్జున .. తాజాగా నటించిన సినిమా “నా స్వామి రంగా” సంక్రాంతి కానుకగా నేడు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ అందుకుంది . సూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా నాగార్జున అభిమానులు ఒక్కసారైనా ఈ సినిమాని చూడొచ్చు .. ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ డ్రామా. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రలో కనిపించారు .

అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున వే ఆఫ్ స్టైల్ టాకింగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . కాగా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద గుంటూరు కారం – హనుమాన్ – సైంధవ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి . మూడు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. నాలుగో సినిమాగా రిలీజ్ అయిన నా స్వామి రంగా కూడా మంచి హిట్ టాక్ అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి జనాలు పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా హీరోయిన్ ఆశిక రంగనాథ్ అందాలు సినిమాకి మరింత కలిసి వచ్చాయని చెప్పాలి . అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున మరో సోగ్గాడే చిన్నినాయన రేంజ్ లో రెచ్చిపోయి నటించాడు అని .. కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా కూడా అదంతా హద్దులు మీరకుండా సరదాగే ముందుకెళ్ళిపోయిందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన నా స్వామి రంగా పరలేదు అనే టాక్ దక్కించుకునింది . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news