Movies"నా కొడకల్లారా తెగించినోడిని పండబెట్టి నరుకుడే".. ఊర నాటు వైలెంట్ గా...

“నా కొడకల్లారా తెగించినోడిని పండబెట్టి నరుకుడే”.. ఊర నాటు వైలెంట్ గా దేవర గ్లింప్స్(వీడియో)..!

వచ్చేసింది.. కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసిన దేవర గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్ ఆర్ ఆర్ లాంటి హిట్ సినిమా తరువాత తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయిన నందమూరి ఫ్యాన్స్ కళ్ళల్లో కోటి కాంతులు కనిపిస్తాయి. కాగా కొద్దిసేపటి క్రితమే మేకర్స్ దేవర దేవర గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

గ్లింప్స్ తోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు కొరటాల. అంతేకాదు ఎన్టీఆర్ ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలి అనుకున్నారో అదేవిధంగా చూపించాడు . పక్కాగా చెప్పాలి అంటే ఆది సినిమా టైంలో ఎన్టీఆర్ ఎంత కోపంగా కనిపించారో దేవర గ్లింప్స్ లో కూడా మనకి అంతే కోపంగా గాంభీరంగా కనిపిస్తాడు. శ్రత్రువులను కంటి చూపుతోనే చీల్చి చండాడే మనిషి లా తారక్ జీవించేశాడు.

దేవర గ్లింప్స్ స్టార్టింగ్ లోనే మనకి భారీ పడవల్లో కొంతమంది దోచుకోవడానికి వచ్చినట్లు చూపిస్తారు. అంతే కాదు వాళ్ళని నరుకుతూ ఎన్టీఆర్ చాలా వైల్డ్ యాంగిల్ లో మనకి కనిపిస్తాడు. అంతేకాదు అనిరుధ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా హైలెట్గా నిలిచింది. సముద్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇంగ్లీషులో లిరిక్స్ రాసి అద్భుతంగా ఆకట్టుకున్నాడు . You never touch the sea.. You never play with me.. I’ll never show you mercy.. I’ll never let you be!

అంతేకాదు చివరిలో అందర్నీ అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేస్తూ ఎన్టీఆర్ విజృంభించేశాడు . చివరిలో “ఈ సముద్రం చేపల కంటే ఎక్కువగా నెత్తురునే చూసి ఉంటుంది.. అందుకే ఎర్ర సముద్రం అంటూ పేరు వచ్చింది అంటూ తనదైన స్టైల్ లో డైలాగును చాలా బోల్డ్ గా చెప్పి గ్లింప్స్ ని ఎండ్ చేశారు”. మొత్తానికి చిన్న గ్లింమ్స్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు మన తారక్. అంతేకాదు దేవర కచ్చితంగా చరిత్ర తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఘాటుగా దేవర పై Comments చేస్తున్నారు. “నా కొడకల్లారా తెగించినోడిని ఇక పండబెట్టి నరుకుడే” అంటూ ఓ రేంజ్ లో ఈ గ్లింప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news