Moviesవావ్: ఆ మూవీ సీన్‌ ని.. తన భార్య నమ్రతతో రీ...

వావ్: ఆ మూవీ సీన్‌ ని.. తన భార్య నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. ఫోటో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పని చేసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఆయనకున్న మంచితనం కారణంగా కావచ్చు లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కారణంగా కావచ్చు ఆయన పెట్టిన ఫోటోలు మిలియన్స్ లైక్స్ దక్కించుకుంటూ ఉంటాయి . కదా రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు .

ఈ పిక్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . న్యూ ఇయర్ సందర్భంగా విష్ చేస్తూ ఆయన ఒక పిక్ షేర్ చేశారు . ఆ ఫోటోలో మహేష్ నమ్రతని ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడుతున్నట్లు కనిపిస్తాడు . ఈ పిక్చర్ చూసి చాలా చాలా సంతోషపడుతున్నారు. అంతేకాదు మీ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఆశీర్వదిస్తున్నారు . అయితే ఈ పిక్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది ఓ సినిమాలోని సీన్ అంటూ కనిపెట్టేశారు .

ఖలేజా సినిమాలోని ఓ సీన్ ని మహేష్ బాబు ఇలా తన భార్య నమ్రతతో రీ క్రియేట్ చేశారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఖలేజా సెకండ్ హాఫ్ లో మహేష్ బ్రహ్మానందం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే మహేష్ ఆమెను ఓదార్చడానికి దగ్గర తీసుకొని సేమ్ ఇదేవిధంగా ఆమెను బుజ్జగిస్తాడు. ఆ సీనులో మహేష్ అనుష్క స్టిల్స్ ఇప్పుడు నమ్రతతో షేర్ చేసిన స్టిల్స్ ఇంచుమించు ఒకేలా ఉండడంతో అభిమానులు ఈ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే . ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాడు మహేష్ బాబు ఈ న్యూ ఇయర్ ని . దానికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news