Moviesఓరి దేవుడోయ్.."దేవర"లో ఎన్టీఆర్‌ పాత్ర అదా..? గ్లింప్స్ తో అసలు స్టోరీ...

ఓరి దేవుడోయ్..”దేవర”లో ఎన్టీఆర్‌ పాత్ర అదా..? గ్లింప్స్ తో అసలు స్టోరీ లీక్‌ చేసిన కొరటాల..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ దేవర అనే సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే దేవర నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు . దాదాపు రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా వస్తుండడంతో అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై హైప్స్ పెంచేసింది . దేవరలో ఎన్టీఆర్ చాలా క్రూరంగా కనిపించబోతున్నట్లు చిన్న గ్లింప్స్ తోనే తెలిసిపోయింది. అభిమానులు దేవర గ్లింప్స్ గమనిస్తే చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ పాత్ర దేవర కధకి సంబంధించిన హిట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది . గతంలో తెలుగు సినిమాలో ఎన్నడు లేని విజువల్ ట్రీట్ ఈ సినిమాలో చూపించబోతున్నారు. సినిమా చాలావరకు రాత్రి సమయంలోనే సాగుతుంది అంటూ గ్లింప్స్ బట్టి అర్థమవుతుంది .

అంతేకాదు ఈ సినిమాలో చాలా సస్పెన్స్ లు ఉన్నాయి అంటూ కూడా దేవర వాయిస్ చెప్తుంది . అంతేకాకుండా అప్పుడు రిలీజ్ చేసిన జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ కూడా నైట్ మోడ్ లోనే కనిపించింది. ఇప్పుడు గ్లింప్స్ మొత్తం నైట్ మోడ్ లోనే తెరకెక్కించారు . ఏదో స్పెషల్ కాన్సెప్ట్ తోనే ముందుకు తీసుకెళ్తున్నారా అన్న ఊహలు రాక మానవు. పక్కగా చెప్పాలంటే ఎన్టీఆర్ మార్క్ యాక్షన్ సినిమాకి హైలెట్ కాబోతుంది . లుంగీలో కనిపించడం ఎన్టీఆర్ మరింత మాస్ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది . ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ లుంగీతో కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది .తారక్ ఫ్యాన్స్ కి అది బాగా నచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news