Movies"ఏం పీకుతావ్ రా"..జర్నలిస్ట్ పై కోపంతో ఊగిపోయిన దిల్ రాజు ..వీడియో...

“ఏం పీకుతావ్ రా”..జర్నలిస్ట్ పై కోపంతో ఊగిపోయిన దిల్ రాజు ..వీడియో వైరల్..!!

దిల్ రాజు ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన ..నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ అంతా చెప్పుకుంటూ ఉంటారు . దిల్ రాజు చాలా టాలెంటెడ్ పీపుల్స్ ని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు . ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూడా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి డిస్ట్రిబ్యూటర్ నుంచి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు .

ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత స్థాయికి రావడం మామూలు విషయం కాదు. దాని వెనక ఎంతో కష్టం కృషి పట్టుదల అన్నీ కూడా ఉండాలి . అయితే కావాలనే కొందరు దిల్ రాజు పై మండిపడుతున్నారు. కావాలని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు . ఈ క్రమంలోనే ఆయనపై తప్పుడు వార్తల రాయడం ప్రారంభించారు. అంతేకాదు రీసెంట్గా హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ కేటాయించడం వెనక దిల్ రాజు హస్తం ఉంది అంటూ పలు వెబ్సైట్స్ ఆయనపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసేసేయ్.

అంతేకాదు రీసెంట్గా చిరంజీవి దాని గురించి మాట్లాడిన విషయాలను తప్పుపడుతూ మరి తప్పుగా వార్తలు ప్రచురించాయి . ఈ క్రమంలోనే దిల్ రాజు రీసెంట్గా ఆ ఇష్యూ పై ఫైర్ అయిపోయారు . సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ” చాలా కష్టపడి స్థాయికి వచ్చానని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు అని బాధ పడిపోయారు”. అంతేకాదు ఓసినీ ప్రముకుడిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతుంది.

“పిచ్చిగా రాతలు రాస్తే వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి.. ఏమనుకుంటున్నారు ” అంటూ ఆయన మండిపడడం ఈ వీడియోలో మనం చూడొచ్చు . అలాగే చిరంజీవి నాపై మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్స్ తప్పుగా ప్రచురించాయి అని ఫైర్ అవుతూ తాటతీస్తా అంటూ కూడా దిల్ రాజు హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుంది. అతనిని ఆపడానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా దిల్ రాజు ఫుల్ ఫైర్ అయిపోయారు . దిల్ రాజు ఇంతలా అరవడం మనం ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని ఏళ్లల్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం . దీనితో దిల్ రాజు ఎంతలా హార్ట్ అయ్యారో ఆ వార్తలకు అంటూ దిల్ రాజు ఫ్యాన్స్ బాధపడి పోతున్నారు . ప్రజెంట్ దిల్ రాజు మాట్లాడిన ఆ మాటల తాలూకా వీడియో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news