Movies"గుంటూరు కారం" చూసి సెన్సర్ సభ్యులు షాక్.. ఏ సర్టిఫికెట్...

“గుంటూరు కారం” చూసి సెన్సర్ సభ్యులు షాక్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చిందో తెలుసా..? రన్ టైం ఎంతంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ వరకు అన్ని అవాంతరాలు ఎదుర్కొంటూనే వచ్చింది . మహేష్ బాబు పేరెంట్స్ చనిపోవడం ..ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాని వాయిదా వేయడం .. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ గొడవలు రావడం ..రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను నిరాశపరచడం ..

ఒకటా రెండా.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ అవాంతరాలే అలా అడుగడుగునా ప్రాబ్లమ్‌స్ ఎదుర్కొని ఫైనల్లీ ఈ శుక్రవారం 12వ తేదీ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా .కాగా ఇప్పుడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మూవీ రన్ టైం విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా 2 గంటల 39 నిమిషాలు నిడివితో ఆడియన్స్ ముందుకు రాబోతుంది .

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఊఆ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది . దీనితో సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇదే న్యూస్ నీ ట్రెండ్ చేస్తున్నారు . ఒక అప్పట్లో మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఎంత హిట్ అయిందో అంతకు డబల్ రేంజ్ లో ఈ సినిమా హిట్ కాబోతుంది అని .. ఖచ్చితంగా ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ కి బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని.. మాస్ రేంజ్ తోనే ఈ సినిమాలో ఆకట్టుకోబోతున్నాడు అని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news