Moviesక‌థ నేను చెప్పిన‌ట్టు మార్చు.. స్టార్ డైరెక్ట‌ర్‌కు చుక్క‌లు చూపిస్తోన్న టాలీవుడ్...

క‌థ నేను చెప్పిన‌ట్టు మార్చు.. స్టార్ డైరెక్ట‌ర్‌కు చుక్క‌లు చూపిస్తోన్న టాలీవుడ్ క్రేజీ హీరో..!

టాలీవుడ్‌లో అత‌డో కుర్ర క్రేజీ హీరో. మామూలుగానే అత‌డు బాగా యాట్యిట్యూడ్ చూపిస్తాడ‌న్న టాక్ ఉంది. ఇంకా స్టిల్ బ్యాచిల‌ర్‌గానే ఉన్నా తానో గోప్ప సీనియ‌ర్ హీరోను అన్న బిల్డ‌ప్ కాస్త ఎక్కువే అని సినీ జ‌నాలు అంటారు. కాస్త కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రితో అయినా సినిమా చేస్తే వాళ్ల మీద‌కు బాగా ఎక్కేస్తాడ‌ని.. అంతా త‌న‌కే తెలుసు అన్న‌ట్టుగా సెట్స్‌లో ఉంటాడ‌ని అంటారు.

వ‌రుస ప్లాపుల దెబ్బ‌కు కాస్త దిగొచ్చాడు. వ‌రుస ప్లాపుల్లో ఉన్న ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌, ఈ హీరో కాంబినేష‌న్లో ఓ మాంచి హిట్ ప‌డింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస ప్లాపులే. ఆ డైరెక్ట‌ర్ ఓ పాన్ ఇండియా మూవీ అంటూ చేతులు కాల్చుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ కుర్ర హీరో, ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్నారు. సినిమా చాలా స్పీడ్‌గా అంటే స్పీడ్‌గా రెండు నెల‌ల్లోనే తీసేస్తాడ‌ని పేరున్న ఆ సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌కు .. ఈ కుర్ర హీరో త‌న యాట్యిట్యూడ్‌తో చుక్కలు చూపించేస్తున్నాడ‌ట‌.

క‌థలో వేళ్లు పెట్టి కెలికేయ‌డంతో పాటు క‌థ‌ను, సీన్ల‌ను తాను చెప్పిన‌ట్టు మార్చాల‌ని ఆ ద‌ర్శ‌కుడిపై ఒత్తిడి చేస్తున్నాడ‌ట‌. దీంతో ఈ షూటింగ్‌కు ఇప్ప‌టికే రెండు మూడుసార్లు బ్రేకులు ప‌డ్డాయ‌ట‌. చివ‌ర‌కు షూటింగ్ బాగా డిలే అవ్వ‌డంతో ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కూడా సినిమాపై స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని.. ఆయ‌న కూడా హీరో తీరుతో బాగా విసిగిపోతున్నాడంటున్నారు.

ఈ సినిమాను ముందుగా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చిలో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. షూటింగ్ ప‌దే ప‌దే డిలే అవుతుండ‌డంతో ఇప్పుడు ముంద‌నుకున్న‌ట్టుగా సమ్మ‌ర్‌కు వ‌చ్చే ఛాన్సే లేదంటున్నారు. ఏదేమైనా ఆ కుర్ర హీరో కెలుకుడు దెబ్బ‌కు ఆ సీనియ‌ర్ స్పీడ్ డైరెక్ట‌ర్‌కే చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news