Moviesపోయి పోయి ఆ హీరోని చూస్ చేసుకున్నావ్ ఏంటి త్రివిక్రమ్.. అజ్ఞాతవాసికి...

పోయి పోయి ఆ హీరోని చూస్ చేసుకున్నావ్ ఏంటి త్రివిక్రమ్.. అజ్ఞాతవాసికి మించిన డిజాస్టర్ పక్క ..చూసుకో..!!!

త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. ఆయన రాసే డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వినే వాళ్ళకి ఇంకా ఇంకా వినాలి అంటూ చూసేవాళ్ళకి ఏదో ఇది ఎక్కడో విన్నామే అని అంత ఫీలింగ్ కలుగుతుంది . మన వాడుక భాషలో మాట్లాడే పదాలన్నిటిని కలగలిపేసి స్పాంటేనియస్ డైలాగ్స్ రాయడంలో త్రివిక్రమ్ తర్వాతే మరి ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు.

కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రజెంట్ గుంటూరు కారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే బన్నీతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాను కూడా పూర్తిస్థాయి జూలాయి లాగే తెరకెక్కించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఆ తర్వాత వెంటనే హీరో నానితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడట త్రివిక్రమ్.

చేసిన హీరోలతోనే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట . అయితే త్రివిక్రమ్ బాడీ లాంగ్వేజ్ కి నానికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు అంటున్నారు ఫాన్స్ అంతేకాదు నువ్వు రిస్క్ చేస్తే అజ్ఞాతవాసికి మించిన డిజాస్టర్ కచ్చితంగా నీ ఖాతాలో పడుతుంది చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి త్రివిక్రమ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news