Movies' స‌లార్ ' టాక్ చూసి దెబ్బ‌కు మూసుకున్నారు... ఆ స్టార్...

‘ స‌లార్ ‘ టాక్ చూసి దెబ్బ‌కు మూసుకున్నారు… ఆ స్టార్ హీరో ఫోన్ స్విచ్ఛాఫ్‌…!

టాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోతుందో చెప్పక్కర్లేదు. గత కొన్ని ఏళ్ళుగా షారుక్ కు సరైన హిట్లు లేవు. అలాంటిది ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండుసార్లు రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఒకప్పుడు షారుక్ కంటే బాలీవుడ్ బాద్‌షా.. తన సినిమాకి ఎవరైనా దారి ఇవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పటి మాట. పైగా ఈ యేడాది రెండు సినిమాలతో రెండు సార్లు రూ.1000 కోట్లు కొట్టినా కూడా షారుక్.. మన ప్రభాస్ రాజు సలార్ దెబ్బకు తట్టుకోలేక రిలీజ్‌కి ముందే పెద్ద రాజకీయం చేశాడు.

ముఖ్యంగా నార్త్‌ మల్టీప్లెక్స్ లలో సలార్‌కు సరైన స్క్రీనింగ్ లేకుండా.. ఎక్కువ షోలు ఇవ్వకుండా.. స్వయంగా రంగంలోకి దిగి మల్టీప్లెక్స్ చైన్లను మేనేజ్ చేశాడు. తర్వాత సలార్‌ నిర్మాతల దెబ్బకు మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్లు దిగివచ్చినా.. తొలి రోజు, రెండో రోజు సలార్ కంటే సినిమాకు ఎక్కువ స్క్రీన్లు దక్కాయి. ఎప్పుడు అయితే శుక్రవారం రిలీజ్ అయిన సలార్‌కు భయంకరమైన టాక్‌ వచ్చింది.

శనివారానికే చాలాచోట్ల ఢంకీ షోలు తగ్గించేసి స‌లార్ షోలు విపరీతంగా పెంచేశారు. తొలిరోజు వసూళ్లలో ఢంకీ కంటే సలార్ పది అడుగులు ముందుంది. అసలు వసూళ్లలో ఈ రెండు సినిమాలకు పోటీనే లేదు. ఉత్తరాదిన సలార్ కి తక్కువ థియేటర్‌లు దక్కాయి. అయితే ఆక్యుపెన్సీల విషయంలో మాత్రం ఢంకీని డింకీలు కొట్టించింది. సలార్ రెండో రోజు.. ఢంకీ సినిమాకు ఉత్తరదిలో కేవలం 50% ఆక్యుపెన్సి దక్కింది. సలార్ దాదాపు 80% ఆక్యుపెన్సితో ఢంకీని దాటేసింది.

ఢంకీ తొలి రోజు వసూళ్ల కంటే సలార్ ఓపెనింగ్స్ చాలా ఎక్కువ. దీన్నిబట్టి ఈ పోటీలో ప్రభాస్ షారుక్‌ని దాటేసినట్టు అయింది. ఢంకీ చెత్త సినిమా కాదు బాలీవుడ్ లో మంచి రేటింగ్ వచ్చాయి. రాజ్‌కుమార్ హిరాణీ గత సినిమాల స్థాయిలో లేకపోయినా క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే సలార్ డామినేషన్ దెబ్బతో ఢంకీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక తొలి రోజు వసూళ్లతో మాంచి ఉత్సాహంగా ఉన్న షారుక్.. సలార్ రిజల్ట్ చూశాక రెండో రోజుకే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news