Moviesరైటు బిడ్డ బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలవడం వెనుక...

రైటు బిడ్డ బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలవడం వెనుక ..ఆ తెలుగు స్టార్ హీరో హస్తం ఉందా..? అందుకే కప్ కొట్టాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలకు ఫాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్తే ఊగిపోతారు జనాలు .

అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . చాలామంది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకుంటూ ఉంటారు . కాగా రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ తన సొంత టాలెంట్ తో తనదైన స్టైల్ లో ఆటలు ఆడి జనాలను మెప్పించాడు .

కానీ అన్ని ఓట్లు రావాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు . దీనంతటి వెనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారని.. ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టే పల్లవి ప్రశాంత్ కు అన్ని ఓట్లు వచ్చి కప్పు గెలుచుకొని విన్నర్గా నిలిచాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ కి ఇచ్చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news