Moviesఆ మూడు తప్పులు చేయకుండా ఉంటే.. ప్రభాస్ సలార్ వేరే...

ఆ మూడు తప్పులు చేయకుండా ఉంటే.. ప్రభాస్ సలార్ వేరే లెవల్ లో ఉండేదా..ప్రశాంత్ నీల్ భయపడ్డడా..?

సలార్..సలార్..సలార్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారూమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పాలి . సినిమాలో ఏవి ఎంతెంతలో ఉండాలో అంతంత రేంజ్ లో తెరకెక్కించే సినిమాను సూపర్ డూపర్ హిట్ గా మలిచేశాడు ప్రశాంత్ నీల్. తెరపై కనిపించిన ప్రభాస్ ఈ సినిమాకి హీరో అయితే తెర వెనుక ఉండి నడిపించిన ప్రశాంత్ నీల్కూడా ఈ సినిమాకి బిగ్ హీరోగా మారిపోయాడు .

సినిమాను చూసిన జనాలు ప్రభాస్ ని ఏ రేంజ్ లో పొగుడుతున్నారో అంతకు డబల్ రేంజ్ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పొగిడేస్తున్నారు . అయితే సినిమాలో ప్లస్ పాయింట్స్ కాదు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఆ మైనస్ లేకుండా ఉంటే సలార్ సినిమా ఇంకా బీభత్సంగా ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు.

సినిమా మధ్యలో గజిబిజిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు ప్రశాంత్ నీల్.. ఒకరకంగా చెప్పాలంటే ఆయన టెన్షన్ పడ్డాడని చెప్పొచ్చు. అది ప్రభాస్ ఫ్యాన్ బేస్ కారణంగా కావచ్చు లేకపోతే మరి ఏదైనా కారణం కావచ్చు ..యాక్షన్ ఎలివేషన్ సీన్స్ పై దృష్టి ఎమోషనల్ సీన్స్ పై పెట్టలేకపోయాడు . కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ ఎంత హైలెట్ అయిందో మనకు తెలుసు . కానీ ఇక్కడ స్నేహం సెంటిమెంట్ ఆ విధంగా పండలేకపోయింది .

యాక్షన్ సీన్స్ వరకు ఓకే కాని సెంటిమెంట్ పరంగా సలార్ నిల్ అనే చెప్పాలి . ముఖ్యంగా ఈ కథలో క్లారిటీ లేదు . సలార్లో ఫ్రెండ్షిప్ గురించి టచ్ చేసాడు కానీ ప్రభాస్ పృథ్వీరాజ్ ఒకరికోసం ఒకరు ఎలా నిలబడతారో చెప్పలేకపోయాడు . ఇంకాస్త డెప్త్ గా చూపించుంటే ఇంకా బాగుండేదేమో . కాన్సర్ కధ .. వంశాల గురించి చెప్పే విషయంలో క్లారిటీ మిస్ అయింది. ఫాస్ట్ గా వివరిస్తూ వెళ్ళిపోయాడు . ఈ సమయంలో జనాలకు అసలు పాయింట్ మిస్ అయింది. పాత్రల విషయంలో కూడా కన్ఫ్యూషన్ ఏర్పడింది . లాస్ట్ కి మన ప్రభాస్ పాత్ర విషయంలోనూ అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఎంత మిస్టేక్ చేసాడో అర్థం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news