Newsఆ విష‌యంలో నానిది తిరుగులేని రికార్డ్‌.... ప‌వ‌న్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌కే లేదుగా...!

ఆ విష‌యంలో నానిది తిరుగులేని రికార్డ్‌…. ప‌వ‌న్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌కే లేదుగా…!

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పని చేయాలంటే హీరోలకు చాలా గ‌ట్స్ కావాలి. అన్నిటికీ మించి వాళ్ళను నమ్మాలి. ఇక స్టార్ హీరోలు.. అనుభవం ఉన్న‌ స్టార్ డైరెక్టర్లతోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం కొత్త దర్శకులతో పని చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉంటారు. నాని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్లలో నాని పలువురు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కొత్త దర్శకులతో పనిచేసి మంచి రిజల్ట్ కూడా అందుకున్నాడు.

కేవలం హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా యంగ్‌టాలెంట్ ని ప్రోత్సహించిన ఏకైక హీరో నాని కావడం విశేషం. నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొత్త డైరెక్టర్లు ఎవరు ? ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. కెరీర్ ప్రారంభంలోనే నాని అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో నందిని రెడ్డి దర్శకురాలుగా పరిచయం అయింది. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ‌ అశ్విన్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. శివ నిర్వాణతో నిన్ను కోరి సినిమా చేసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు.

హీరో గానే కాకుండా నాని నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మతో అ..ఆ అనే డిఫరెంట్ మూవీ తీసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. ఇక తాజాగా హిట్ సినిమా నిర్మించాడు.. ఈ సినిమాతో శైలేష్ కొలను వెండితెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించాడు. ఆ తర్వాత వచ్చిన హిట్‌2 కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల‌ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు.

ఈ సినిమా నాని కెరీర్ లో ఫస్ట్ టైం రూ.100 కోట్ల సినిమాగా రికార్డుల్లో నిలిచింది. తాజాగా నాని హాయ్ నాన్న సినిమాతో మరో కొత్త దర్శకుడు శౌర్యవ్‌ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలా ఇప్పటివరకు నాని కొత్త దర్శకులతో పనిచేసి మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇలాంటి రికార్డు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, పవన్, మహేష్, బన్నీకే లేవు. ఏది ఏమైనా ఈ విషయంలో నాని గట్స్‌ మెచ్చుకోవాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news