Newsద‌గ్గుబాటి కొత్త జంటలో ఈ ట్విస్ట్ చూశారా... అభిరామ్‌ను డామినేట్ చేసిన...

ద‌గ్గుబాటి కొత్త జంటలో ఈ ట్విస్ట్ చూశారా… అభిరామ్‌ను డామినేట్ చేసిన ప్ర‌త్యూష‌…!

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ వివాహ వేడుక శ్రీలంకలో ఎంతో వైభవంగా జరిగింది. వరుసకు మరదలు అయిన ప్రత్యూష చాపరాల అనే అమ్మాయితో అభిరామ్‌ వివాహం ఎంతో వేడుకగా జరిగింది. శ్రీలంకలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందరూ హాజ‌ర‌య్యారు. సురేష్ బాబు రెండో కుమారుడు ఆయన దగ్గుబాటి అభిరామ్.. తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.

ఇక అభిరామ్ కు పెళ్లి చేయలేని డిసైడ్ అయిన సురేష్ బాబు తమ స్వగ్రామం అయిన కారంచేడుకు చెందిన మేనకోడలు అయ్యే ప్రత్యూష చాపరాలతో పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇది పూర్తిగా పెద్దలకు కుదిర్చిన వివాహం. సురేష్ బాబు ఇష్టం మేరకు ఈ పెళ్లి జరుగుతున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలో ఈ పెళ్లి మూడు రోజులపాటు జరిగింది. నూతన దంపతుల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే శుక్రవారం దగ్గుబాటి కుటుంబ సభ్యులు శ్రీలంక నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ క్రమంలోనే నూతన వధూవరులు అభిరామ్ – ప్రత్యూష హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

ఈ వీడియోలో చూసిన దగ్గుబాటి అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ కొత్త దంపతుల్లో అభిరామ్ – ప్రత్యూష పక్కపక్కనే ఉంటే అభిరామ్ కంటే ప్రత్యూష కాస్త డామినేటింగ్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. పెళ్ళికి ముందే కాస్త ఒళ్ళు చేసి బొద్దుగా కనిపిస్తోంది. అలాగే అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ కంటే ప్రత్యూష ఎక్స్ప్రెషన్స్, యాక్టివ్‌నెస్ బాగుందన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఆ మాటకు వస్తే అహింస సినిమాలో అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ అంత గొప్పగా లేవు అన్న చర్చ జరిగింది. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా తన భార్య ప్రత్యూషతో పోలిస్తే అభిరామ్ కాస్త డల్ గా ఉన్నాడన్న కామెంట్లు నడుస్తున్నాయి. ప్రత్యూష కూడా ఎయిర్‌పోర్ట్‌లో చాలా యాక్టివ్ గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తూ దూసుకు వెళుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు మొత్తానికి దగ్గుపాటి కొత్తకోడలు చాలా యాక్టివ్ అని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news