News' స‌లార్ ' లో క‌ళ్లు చెదిరే కొత్త సీన్‌... ర‌న్...

‘ స‌లార్ ‘ లో క‌ళ్లు చెదిరే కొత్త సీన్‌… ర‌న్ టైం పెరిగిందోచ్‌…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా, కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలుగా ఇండియన్ సినీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎలా ఎదురు చూస్తున్నారో ? చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండడంతో మేకర్స్‌ సాలిడ్ అప్డేట్‌లు ఒక్కొక్కటి బయటకు వదులుతున్నారు.

ఈ క్రమంలోనే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డ్‌ నుంచి ఏ సర్టిఫికెట్‌తో పాటు యాక్షన్ సినిమాగా కామెంట్ అందుకుంది. సలార్‌ సెన్సార్ రన్ టైం డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేసాయి. ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 175 నిమిషాల పాటు సలార్ థియేటర్లలో వీరంగం ఆడనుంది. అయితే ఇప్పుడు సలార్ రన్ టైం పెరిగింది. అదనంగా మరో నిమిషంన్నర రన్ టైం మేకర్స్ ఫ్రెష్ గా యాడ్ చేసినట్టు తెలుస్తోంది.

కొత్తగా యాడ్ చేసిన ఈ నిమిషంన్నర యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. ఇంటర్వెల్‌కు ముందు కళ్ళు చెదిరే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇప్పుడు అదనంగా యాడ్ చేశారని.. ఇది సినిమాలో కచ్చితంగా హైలెట్గా నిలుస్తుందని తెలుస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్‌ నిర్మించిన ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించారు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ డైనోసార్ థియేటర్ల దగ్గర గర్జించనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news