Newsఅనుష్క-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా...

అనుష్క-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..సెట్ అయ్యుంటే ఫ్యాన్స్ కి పండగే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ స్వీటీ అదేనండి అనుష్క అంటే జనాలకు ప్రత్యేక ఇష్టం రీజన్ ఏంటో తెలియదు కానీ అనుష్కను చూస్తే అందరూ మన ఇంట్లోనే అమ్మాయిల ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు. అనుష్క కూడా తన ఫ్యాన్స్ పట్ల అదే ఫీలింగ్ ని వ్యక్తం చేస్తూ ఉంటుంది . కాగా రీసెంట్ గానే తన బర్త్డ డేను గ్రాండ్గా జరుపుకున్న అనుష్క శెట్టి కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించింది అనుష్క. కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ లు అయ్యాయి . చాలా తక్కువ సినిమాలనే ఆమె రిజెక్ట్ చేసింది . అయితే అనుష్క శెట్టితో నటించే ఛాన్స్ వస్తే విజయ్ దేవరకొండ తిరస్కరించడం అప్పట్లో హాట్ టాపిక్ మారింది. ఆ సినిమా మరేదో కాదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఎస్ ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి పాత్ర కోసం ముందుగా హీరో విజయ్ దేవరకొండను అనుకున్నారట .

ఆమె హైట్ కి ఆమె వెయిట్ కి పర్జెంట్ ఉండే జనరేషన్లోకి ఆ హీరో అయితే ది ఆప్ట్ గా సరిపోతారు అని.. సినిమాకి మంచి క్రేజ్ లభిస్తుంది అంటూ ఫిక్స్ అయ్యారట. కానీ విజయ్ దేవరకొండ స్టోరీ విని “ఇలాంటి స్టోరీ నేను చేయలేను” అంటూ హ్యాండ్ ఇచ్చేశారట. దీంతో ఆ కథ ఫైనల్లీ నవీన్ పోలిశెట్టి చేతికి చేరింది . సినిమా కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా టాక్ మాత్రం బిగ్ బ్లాక్ బస్టర్ అందుకుంది . అలా అనుష్క – విజయ్ దేవరకొండ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయిపోయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news