సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా కొంతమంది హీరోలను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . వాళ్ళ సినిమాలు హిట్ అయినా ఫటైనా వాళ్ళని అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు . ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కూల్ క్లాస్ లవబుల్ స్టోరీస్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా జనాలు మరీ ముఖ్యంగా యువత ఇష్టపడే సినిమాలను చూస్ చేసుకోవడంలో రామ్ పోతినేని తర్వాత ఎవరైనా అని చెప్పాలి. ముద్దుగా జనాలు రాంపోతినేను ర్యాపో అంటూ పిలుస్తూ ఉంటారు .
కాగా ఆయన ఆఖరిగా నటించిన సినిమా స్కంద . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా తెరకెక్కించిన బోయపాటికి .. అదే విధంగా రామ్ పోతినేని కి నెగిటివ్ మార్క్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ స్టెప్ తీసుకుంటున్నాడు రామ్ పోతినేని . అయితే ప్రెసెంట్ రెండు సినిమాల్లో నటిస్తున్న రామ్ పోతినేని ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడట . ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తుంది .
చిన్న హీరోలు యాక్టర్స్ ఓటీటీ వెబ్ సిరీస్లను ఎక్కువగా నమ్ముకుంటున్నారు . ఆ బాలీవుడ్ లో అయితే పెద్ద హీరోలు కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నారు . కానీ తెలుగులో ఇంకా అంత పెద్ద వాతావరణం నెలకొనలేదు . వెంకటేష్ – రానా మాత్రమే వెబ్ సిరీస్లో మెరిసారు . అయితే ఇప్పుడు రాం పోతినేని కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట . దానికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్ పై సైన్ కూడా చేసేసాడట . అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నాడట రామ్ పోతినేని . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనాలో ..? లేదా..? ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాక వెండితెర ఆఫర్స్ ఆశాజనకంగా ఉండదు అని బాధపడాలో అర్థం కావడం లేదు అంటున్నారు . నెట్ ఫ్లిక్స్ వాళ్లు భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట . ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!