Newsఅమ‌లతో పెళ్లి త‌ర్వాత కూడా నాగార్జున ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్లు వీళ్లే...!

అమ‌లతో పెళ్లి త‌ర్వాత కూడా నాగార్జున ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్లు వీళ్లే…!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా వస్తుందంటే చాలు రెండు దశాబ్దాల క్రితం మహిళ అభిమానులు ఫస్ట్ డే సినిమా చూసేసేవారు. కాలేజ్ అమ్మాయిలైతే ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టి మరి నాగార్జున సినిమాలు చూసేవారు. నాగార్జునకి లేడీస్ కింగ్‌ అనే పేరు ఉంది. చాలామంది హీరోయిన్లతో చాలా చాలా సన్నిహితంగా ఉండడంతో పాటు వారితో రకరకాల బంధాలు, సంబంధాలు కొనసాగిస్తారు అన్న వార్త ఇండస్ట్రీలో ఉంది.

నాగ్ మంచి ప్లే బాయ్ అంటారు. తన సినిమాలో నటించిన చాలామంది హీరోయిన్లతో నాగార్జున చాలా రోజులు పాటు లింకులు పెట్టుకుంటాడు అన్న పుకార్లు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నాయి. నాగార్జున ముందుగా రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుని నాగచైతన్య పుట్టాక విడాకులు ఇచ్చేశాడు.
ఆ తర్వాత తనతో కలిసి సినిమాలలో నటించిన అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. అమలతో పెళ్లి చేసుకుని అఖిల్‌ పుట్టాక కూడా నాగార్జున కొంతమంది హీరోయిన్లతో సంబంధాలు నడిపాడన్న పుకార్లు ఇండస్ట్రీలో అందరికీ తెలిసు.

నాగార్జున – టబు బంధం గురించి పంకాను పుంకాలుగా వార్తలు ఉన్నాయి. నిన్నే పెళ్లాడుతా సినిమా టైమ్ నుంచి నాగార్జున – టబు మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆవిడా మావిడే సినిమాలో నటించారు. ట‌బు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయింది దీనికి కారణం నాగర్జునపై ఉన్న ప్రేమే అని అంటారు. ఇప్పటికీ టబు నాగార్జునకు చెందిన ఇంట్లోనే ఉంటుందని చర్చ నడుస్తూ ఉంటుంది.

ఇక రమ్యకృష్ణ – నాగార్జున కూడా చాలా అంటే చాలా సన్నిహితంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అవ్వడంతో వీరి బంధం పై కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత అనుష్క – నాగార్జున ఎంత క్లోజ్ గా ఉన్నారో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. అనుష్కను వెండితెరకు పరిచయం చేసిందే నాగార్జున. దాదాపు 10 ఏళ్లపాటు ఎంతో గాఢమైన స్నేహంతో ఉన్న వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఇప్పుడు ఎవరిదరి వారు చూసుకున్నారని టాక్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news