Newsఆ హీరోకు శ్రీలీల అన్యాయం... హీరోను బ‌ట్టి వేరియేష‌నా...!

ఆ హీరోకు శ్రీలీల అన్యాయం… హీరోను బ‌ట్టి వేరియేష‌నా…!

హీరోయిన్లు కాస్త క్రేజ్ వ‌చ్చాక హీరోను బట్టి వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలకు ఒకలా.. స్టార్ హీరో కానీ హీరోల సినిమాలకు మరోలా పనిచేస్తూ ఉంటారన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీ‌లీల‌ కూడా అదే తరహాలో వెళుతుంది అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లోనే ప్రస్తుతం బిజీ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తుంది శ్రీ‌లీల.

అక్టోబర్ నుంచి జనవరి వరకు ఆమె నటించిన సినిమా సగటున నెలకి ఒకటి రిలీజ్ అవుతుంది. దసరాకి భగవంత్‌ కేసరి సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా శ్రీలీల కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందటంలో సందేహం లేదు. ఇక నవంబర్లో వైష్ణవ్ తేజ్‌కి జోడిగా నటించిన ఆది కేశవ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది.

ఇక డిసెంబర్లో నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతో… సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ నెల చివర్లో ఆదికేశవ సినిమా రిలీజ్ కావలసి ఉన్నా శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్లను పట్టించుకోవడంలేదని ప్రచారం జరుగుతోంది. భగవంత్‌ కేసరి సినిమా ప్రమోషన్లలో శ్రీ‌లీల హడావుడి మామూలుగా లేదు. ఆ సినిమాకు సంబంధించి చిన్న చిన్న ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొంది.

నిజం చెప్పాలంటే ఆ సినిమాకు రిలీజ్ ముందు హైప్ రావటంలో అటు బాలయ్య ఉన్నా కూడా శ్రీలీల‌ తన వంతు పాత్ర పోషించింది. పైగా బాలయ్యతో కలిసి కూడా ఓ షో కూడా చేసింది. అయితే ఇప్పుడు వరుస సినిమాల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆదికేశవ సినిమా ప్రమోషన్లకు ఆమె టైం సెట్ కావటం లేదని తెలుస్తోంది. అసలే వ‌రుస‌ హిట్లతో శ్రీ‌లీల‌ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ టైంలో ఆమె ప్ర‌మోష‌న్లు చేస్తే ఖచ్చితంగా ఆదికేశ‌వ సినిమాకు హెల్ఫ్ అవుతుంది. కానీ ఆమె డుమ్మా కొట్ట‌డం ఈ సినిమాకు పెద్ద మైన‌స్సే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news