Newsనాగార్జున ప‌క్క‌న నేనా.. నో చెప్పేసిన స్టార్ హీరోయిన్‌...!

నాగార్జున ప‌క్క‌న నేనా.. నో చెప్పేసిన స్టార్ హీరోయిన్‌…!

కింగ్ నాగార్జున ఎప్పుడూ బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ మీదే కన్నేస్తాడు. ఆయనకి అందుకే మన్మధుడు అని పేరు పెట్టారు. హిందీ హీరోయిన్స్ అంటే నాగార్జున కి మోజెక్కువ. అప్పట్లో శిల్పాశెట్టితో, సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్, టబు లాంటి వారితో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున తలుచుకుంటే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చైనా సరే తెచ్చుకుంటాడు.

అలాంటి నాగార్జునకి నిర్మొహమాటంగా నో చెప్పిన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా. పరిణీతి ముద్దుగా బొద్దుగా మంచి పిక్కలతో కసి రేపేలా ఉంటుంది. బాలీవుడ్ లో ఘాటు రొమాన్స్ సీన్స్ చూస్తే పరిణీతి ప్రతీ ఒక్కరి కల్లోకి వచ్చేస్తుంది. బాలీవుడ్ లో యంగ్ హీరోలతో పరిణీతి చేసిన రొమాన్స్ పీక్స్.

ఇక పర్ఫారెన్స్ పరంగా చూస్తే హిందీలో మంచి స్థానం సంపాదించుకుంది. అలాంటి క్రేజ్ ఉన్న పరిణీతిపైన నాగార్జున కన్నేసి కుదరక ఆశలు వదిలేసుకున్నాడు. ఆ సినిమా నాగార్జున నటించిన గత చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముందు కాజల్ అగర్వాల్ ని నాగార్జున ఎంచుకున్నాడు. కానీ, గర్భం వల్ల కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది.

దాంతో ఈ సినిమాలో పరిణీతిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట. కానీ, నాగార్జున సరసన అనగానే ఎందుకో ఈ హాట్ బ్యూటీ నిర్మొహమాటంగా చెయనని చెప్పేసిందట. దాంతో చివరి ఆప్షన్ గా సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. లేదంటే పరిణీతిని తెలుగులో ఐరెన్ లెగ్ అని కూడా డిసైడ్ చేసేవారేమో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news